Akhanda2: నందమూరి అభిమానులతో పాటు, అఖండ 2 సినిమా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2 తాండవం’ సినిమా తెలంగాణలో రెగ్యులర్ షోల టికెట్ బుకింగ్స్ ఈ రోజు నుంచే ఓపెన్ అయ్యాయి. అలాగే ప్రీమియర్ షోల బుకింగ్స్ రేపటి (డిసెంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12 నుంచి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు, సినిమా ప్రేమికులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
READ ALSO: Tata Sierra: నెల రోజులు కాకముందే.. 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. అలాంటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి, సంయుక్త మేనన్, తదితరులు కీ రోల్స్ పోషిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. టికెట్ బుకింగ్స్ కోసం అధికారిక లింక్ ఇదే..
THE UNSTOPPABLE DIVINE ROAR 🔥🔥🔱#Akhanda2 GRAND RELEASE TEASER out Now!
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6In theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna… pic.twitter.com/dVDff9JDD9— 14 Reels Plus (@14ReelsPlus) December 10, 2025
READ ALSO: Akhanda2 Release Teaser: ఎవర్రా నిప్పుల కొండను ఆపేది..! అఖండ 2 కొత్త టీజర్ చూశారా..