మారుతీ సుజుకి ఇండియా దేశంలోనే ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్న ఏకైక కంపెనీ. డిసెంబర్ 2024లో కూడా కంపెనీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. గత నెలలో కంపెనీ 2,52,693 యూనిట్ల అధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా 2.50 లక్షల యూనిట్ల నెలవారీ విక్రయాల్లో ఇది కొత్త మైలురాయి. ఈ సేల్‌లో దాదాపు 30 వేల యూనిట్ల స్విఫ్ట్ ఉన్నాయి.
మారుతీ సుజుకి 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాను విడుదల చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్ఆర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ డేటా ప్రకారం.. జనవరి నుంచి డిసెంబర్ వరకు 1.98 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ లను విక్రయించారు. అయితే కంపెనీకి చెందిన కార్లు ఏవీ 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటలేకపోయాయి. విశేషమేమిటంటే.. వ్యాగన్ఆర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కూడా అయ్యే అవకాశం ఉంది!