ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి 2025 నవంబర్ మాసం ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. గత నెలలో ఎన్నడూ లేనివిధంగా కంపెనీ అత్యధిక కార్ల విక్రయాలను నమోదు చేసింది. ఒకే నెలలో 2.29 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. దాంతో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. మారుతి సుజుకి ఒక నెలలో ఇన్ని కార్లను ఎన్నడూ అమ్మలేదు. జీఎస్టీ రేటు తగ్గింపు, పండుగ సీజన్ అమ్మకాలు కంపెనీకి కలిసొచ్చాయి. నవంబర్ 2025లో మారుతి సుజుకి మొత్తం…
Maruti Suzuki sales: మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు సోమవారం నవరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నాయి. కొత్త జీఎస్టీ సంస్కరణ అమల్లోకి రావడంతో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం 25,000 యూనిట్లకు పైగా రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. త్వరలో 30,000 యూనిట్లను దాటే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. సోమవారం దాదాపు 80,000 కస్టమర్ తమ కార్లను పరిశీలించేందుకు…
మారుతీ సుజుకి ఇండియా దేశంలోనే ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్న ఏకైక కంపెనీ. డిసెంబర్ 2024లో కూడా కంపెనీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. గత నెలలో కంపెనీ 2,52,693 యూనిట్ల అధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా 2.50 లక్షల యూనిట్ల నెలవారీ విక్రయాల్లో ఇది కొత్త మైలురాయి. ఈ సేల్‌లో దాదాపు 30 వేల యూనిట్ల స్విఫ్ట్ ఉన్నాయి.
మారుతీ సుజుకి 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాను విడుదల చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్ఆర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ డేటా ప్రకారం.. జనవరి నుంచి డిసెంబర్ వరకు 1.98 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ లను విక్రయించారు. అయితే కంపెనీకి చెందిన కార్లు ఏవీ 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటలేకపోయాయి. విశేషమేమిటంటే.. వ్యాగన్ఆర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కూడా అయ్యే అవకాశం ఉంది!
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి డిసెంబర్ 2024లో భారీగా కార్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్‌లో మొత్తం 1,30,117 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. 2023 ఏడాది డిసెంబర్‌లో 1,04,778 యూనిట్లతో పోలిస్తే 24.1% వృద్ధిని నమోదు చేసింది.
నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది.