కారు కొనేవారికి శుభవార్త. జర్మన్ ఆటోమొబైల్ తయారీదారు వోక్స్‌వ్యాగన్ కారుపై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. 2024 డిసెంబర్‌లో ఈ కారును తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.. వోక్స్‌వ్యాగన్ కంపెనీ కొన్ని మోడల్స్‌లో ఎలాంటి ధరలు తగ్గించారో ఇప్పుడు తెలుసుకుందాం…..
Read Also: Minister BC Janardhan Reddy: సంక్రాంతిలోగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తాం..
వోక్స్‌వ్యాగన్ టిగువాన్:
టిగువాన్ (Tiguan) కారును కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెలలో (డిసెంబర్) ఈ SUVపై కంపెనీ రూ. 4.9 లక్షల వరకు తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. ఇందులో రూ. 2 లక్షల వరకు నగదు తగ్గింపు, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అంతే కాకుండా.. 2023లో తయారు చేసిన SUV మోడల్‌ను కొనుగోలు చేస్తే.. ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. 2023 మోడల్‌లో రూ. 90 వేల విలువైన నాలుగేళ్ల సర్వీస్ వాల్యూ ప్యాకేజీ, రూ. 1.50 లక్షల ఎక్స్‌ఛేంజ్‌తో పాటు.. రూ. 20 వేల స్క్రాపేజ్ ప్యాకేజీని కూడా కంపెనీ అందిస్తోంది. ఇండియాలో టిగువాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 35.17 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
వోక్స్‌వ్యాగన్ టైగన్:
టైగన్ (Taigun) కారును కూడా కంపెనీ తక్కువ ధరకు అందించనుంది. డిసెంబర్‌లో ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడం ద్వారా గరిష్టంగా రూ. 2 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆదా దాని ఒక లీటర్ కెపాసిటీ వేరియంట్‌లపై ఉంటుంది. 1.5 లీటర్ సామర్థ్యం కలిగిన వేరియంట్లపై రూ.50 వేల ప్రయోజనం ఉంటుంది. 2023 టైగన్ మోడల్‌లను కొనుగోలు చేస్తే రూ. 50 వేల అదనపు ప్రయోజనాన్ని పొందుతారు.
వోక్స్‌వ్యాగన్ వర్టస్:
వోక్స్‌వ్యాగన్ వర్టస్‌ను ఇండియాలో సెడాన్‌గా తీసుకువచ్చింది. డిసెంబర్‌లో ఈ సెడాన్‌పై రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ దాని ఒక లీటర్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అలాగే.. 1.5 లీటర్ వెర్షన్‌పై కంపెనీ 50 వేల రూపాయల తగ్గింపు ఆఫర్‌లను ఇస్తోంది. 2023 మోడల్స్‌పై అదనంగా రూ.50 వేలు ఆదా అవుతుంది. రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన సెడాన్ కార్ల వేరియంట్‌లపై అదనంగా రూ.40 వేలు ఆదా చేసుకోవచ్చు.