Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Cng Car Demand To Remain Strong Despite Rise In Gas Prices Care Ratings

CNG Cars: గ్యాస్ ధరలు పెరుగుతున్నా.. CNG కార్లకు భలే డిమాండ్..

Published Date :June 10, 2023 , 10:27 pm
By Venu Goapl Reddy
CNG Cars: గ్యాస్ ధరలు పెరుగుతున్నా.. CNG కార్లకు భలే డిమాండ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CNG Cars: పెట్రోల్, డిజిల్ ధరలు సెంచరీ దాటడంతో వాహనవినియోగదారులు ప్రత్యామ్నాయ ఫ్యూయర్ ఆఫ్షన్లు ఉన్న కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాగా.. మరికొన్ని కంపెనీలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లను కలగలిపి హైబ్రీడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలెజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో CNG ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, పెట్రోల్ వాహనాలతో పోల్చితే CNG కార్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటంతో పాటు అధిక మైలేజ్ రావడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ఏర్పడిన ప్రపంచ సరఫరా అంతరాయాల కారణంగా CNG ధరలు గణనీయంగా పెరిగాయని. 2023 ఆర్థిక సంవత్సరంలో సగటు ధరలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.

Also Read

  • Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
  • Tesla Model Y L: టెస్లా మోడల్ Y కొత్త L వేరియంట్ విడుదల.. 661KM రేంజ్‌.. ధర ఎంతంటే?
  • 2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు
  • Hyundai Venue Knight Edition: హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివే

Read Also: Rajnath Singh: ఆ ఏడాది నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది..

గ్యాస్ ధర పెరుగినా కూడా CNG కార్ల అమ్మకాలు 23 ఆర్థిక సంవత్సరంలో 40.7 శాతం పెరిగాయి. పెరిగిన ధరలు మొదట CNG కార్ల రిటైల్ అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని అనుకున్నప్పటికీ దీనికి విరుద్ధంగా పెరిగాయి. రానున్న కాలంలో కూడా CNG కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం CNG కోసం ధరల ఫార్ములాను సవరించడంతో, పెట్రోల్‌తో పోలిస్తే CNG ధరలు తగ్గాయి.

ప్రస్తుతం మారుతి సుజుకీ CNG కార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కంపెనీ నుంచి ఎర్టిగా, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, వ్యాగన్ ఆర్ కార్లు CNG ఫిట్టింగ్ తో వస్తున్నాయి. ఇక మరో దేశీయ దిగ్గజ కార్ మేకర్ టాటా కూడా CNG కార్లపై దృష్టి సారించింది. టాటా నుంచి టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ కార్లు సీఎన్జీ వెర్షన్ లో వచ్చాయి. టాటా నెక్సాన్ కూడా సీఎన్జీ వేరియంట్ లో రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే సీఎన్జీ కార్లలో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉంది. ఇక హ్యుండాయ్ తన ఆరా సెడాన్ కార్ లో సీఎన్జీ వెర్షన్ అందిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CARE Ratings
  • CNG Cars
  • CNG Rates
  • maruti suzuki
  • Tata

తాజావార్తలు

  • Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!

  • Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్‌ఫైర్‌ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో

  • Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్

  • Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..

  • DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions