Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (General Administration Department – GAD) ఉత్తర్వులు వెలువరించింది. ఈ బదిలీల వివరాల ప్రకారం.. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్‌ను పర్యావరణ, అటవీ శాఖ (ఈఎఫ్ఎస్అండ్టీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ, ఎప్ట్రీ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్‌గా నియమించారు. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.వాణి ప్రసాద్‌కు క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన నవీన్ మిట్టల్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజ రామయ్యర్‌ను నియమించగా, రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా కె. ఇలంబరితి (Dr. K. Ilambarithi)ని నియమించడంతో పాటు రవాణా కమీషనర్ బాధ్యతలను కూడా కేటాయించారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్ఎండీఏ పరిధి పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శితో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శృతి ఓజాను నియమించగా, తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా ఉన్న ముషారఫ్ అలీ ఫరూఖీని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసి, ఆ సంస్థ సీఎండీ బాధ్యతలను కూడా కొనసాగించేలా ఆదేశాలిచ్చారు. అలాగే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎస్. సంగీత సత్యనారాయణను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్‌కు టీజీరెడ్కో (TGREDCO) వైస్ ఛైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
- Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
- Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
- Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
తాజావార్తలు
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!