CNG Cars: పెట్రోల్, డిజిల్ ధరలు సెంచరీ దాటడంతో వాహనవినియోగదారులు ప్రత్యామ్నాయ ఫ్యూయర్ ఆఫ్షన్లు ఉన్న కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాగా.. మరికొన్ని కంపెనీలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లను కలగలిపి హైబ్రీడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలెజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.
CNG Rates: సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకురాబోతోంది. ధర పరిమితి విధించేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ఏ, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ధర 10 శాతం వరకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధర 6 శాతం నుంచి 9 శాతానికి…