Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
- డుకాటీ ఫార్ములా 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ భారత మార్కెట్లో విడుదల.
- ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షలు.
- ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి.
- భారతదేశానికి కేటాయించిన అన్ని యూనిట్లు ఇప్పటికే పూర్తిగా బుక్.
- 1973 డుకాటీ 750 సూపర్ స్పోర్ట్ డెస్మోకు నివాళిగా ఈ బైక్ రూపకల్పన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ducati Formula 73 Launched: ఇటాలియన్ లగ్జరీ బైక్ తయారీ సంస్థ డుకాటీ (Ducati) నుండి సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ కేఫ్ రేసర్ ‘ఫార్ములా 73’ (Formula 73) మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల అయ్యింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షలుగా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా.. భారతదేశానికి కేటాయించిన అన్ని యూనిట్లు లాంచ్ అయిన వెంటనే పూర్తిగా బుక్ అయిపోయాయి. డుకాటీ చారిత్రక 1973 మోడల్ ‘750 సూపర్ స్పోర్ట్ డెస్మో’కు నివాళిగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేశారు.
డుకాటీ చరిత్రలో డెస్మోడ్రోమిక్ వాల్వ్ టైమింగ్‌తో రోడ్డుపై నడిచేందుకు వచ్చిన మొట్టమొదటి బైక్ 750 సూపర్ స్పోర్ట్ డెస్మో. 1972 నాటి ప్రసిద్ధ ‘200 మిగ్లియా డి ఇమోలా’ రేసులో పాల్ స్మార్ట్, బ్రూనో స్పగ్గియారిలను విజేతలుగా నిలిపిన 750 ఇమోలా డెస్మో ఆధారంగా ఆ బైక్ రూపుదిద్దుకుంది. ఆ చారిత్రక వారసత్వాన్ని గౌరవిస్తూ ఫార్ములా 73 మోడల్‌ను రూపొందించారు. ఈ మోడ్రన్ వెర్షన్ బైక్ సిల్వర్ & ఆక్వా-గ్రీన్ రంగుల కలయికతో లాంచ్ అయ్యింది. ఫ్యూయల్ ట్యాంక్ పైభాగంలో నిలువుగా ఉండే బంగారు రంగు గీత ఇందులో హైలెట్. ఆనాటి ఇమోలా రేసులో ఫ్యూయల్ గేజ్ లేకుండానే పిట్ క్రూ సిబ్బంది పెట్రోల్ స్థాయిని గుర్తించేందుకు వేసిన రంగు లేని పట్టీకి ప్రతీకగా ఈ గోల్డ్ స్ట్రిప్‌ను అందించారు. క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు, బార్-ఎండ్ మిర్రర్లు, షార్ట్ ఫెయిరింగ్, టేపర్డ్ టెయిల్ వంటి పక్కా కేఫ్ రేసర్ అంశాలతో పాటు అల్యూమినియం లివర్లు, ఫుట్‌పెగ్స్, రిజోమా ఫ్యూయల్ క్యాప్ వంటి ప్రీమియం భాగాలను అందించారు.
Also Read
- 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
- Upcoming SUVs in India: 2026 చివరి నాటికి భారత్‌లోకి రానున్న 4 కొత్త SUVలు.. హోండా EV నుంచి మహీంద్రా వరకు!
ఈ బైక్‌లో 803cc డెస్మోడ్యూ ఎల్-ట్విన్ (Desmodue L-twin) ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,250 rpm వద్ద 73 hp పవర్, 7,000 rpm వద్ద 65.2 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ మోడల్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన టెర్మిగ్నోని (Termignoni) ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ఇందులో చేర్చారు. చేసిస్ పరంగా స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ముందువైపు 41mm KYB అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్, వెనుకవైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ KYB మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇంధనం లేకుండా 183 కిలోల బరువుండే ఈ బైక్, 17 అంగుళాల స్పోక్ వీల్స్ మరియు పిరెల్లి డయాబ్లో రోసో IV (Pirelli Diablo Rosso IV) టైర్లతో వస్తుంది.
రైడర్ భద్రత, నియంత్రణ కోసం ఇందులో కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్, రెండు రైడింగ్ మోడ్‌లను అందించారు. ఈ వివరాలన్నీ 4.3 అంగుళాల TFT స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి. బైక్ చుట్టూ ఫుల్-LED లైటింగ్‌ను సమకూర్చగా, హీటెడ్ గ్రిప్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్లను యాక్సెసరీలుగా ఎంచుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే 873 బైకులలో ప్రతి ఒక్కదాని స్టీరింగ్ ప్లేట్‌పై ప్రత్యేక సీరియల్ నంబర్‌తో పాటు అధికారిక ప్రామాణికత ధృవీకరణ పత్రం (Certificate of Authenticity) లభిస్తుంది. అంతేకాకుండా డుకాటీ స్టైల్ సెంటర్ నుంచి సేకరించిన పాతకాలపు రేసింగ్ ఫోటోలు, స్కెచ్‌లతో కూడిన ప్రత్యేక బాక్స్‌ను కొనుగోలుదారులకు బహుమతిగా అందజేస్తారు.
తాజావార్తలు
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!