ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. కొత్త మోటార్‌సైకిల్ టువోనో 457ను అధికారికంగా విడుదల చేసింది. ఇది భారత మార్కెట్లో అత్యంత చౌకైన అప్రిలియా బైక్! దీని ప్రారంభ ధర రూ. 3.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. కొన్ని నెలల క్రితం, ఈ మోటార్ సైకిల్‌ను ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA మోటార్ షోలో ప్రదర్శించారు. ఇప్పుడు ఈ బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇది స్పోర్ట్, నేకెడ్ బైక్ అని, యువత దీనిని చాలా ఇష్టపడుతుందని కంపెనీ చెబుతోంది. దీనిలో కొన్ని యాంత్రిక మార్పులు చేశారు. ఇది RS 457 నుంచి భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ ప్రధానంగా దేశంలో KTM 390 డ్యూక్ అలాగే, యమహా MT-03తో పోటీ పడుతుంది. టువోనో ధర RS457 మోడల్‌తో పోలిస్తే రూ. 25,000 తక్కువ ధరలనే కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.
READ MORE: Vice Chancellor: పలు యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
అప్రిలియా టువోనో 457లో కంపెనీ 457 సీసీ సామర్థ్యం గల సమాంతర-జంట ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 47.6 హెచ్‌పీ శక్తిని, 43.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేశారు. అప్రిలియా కంపెనీకి చెందిన ఇతర మోడళ్లకు ఇది భిన్నంగా ఉంటుంది. దీని లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఈ బైక్ ట్యాంకులో 12.7 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఈ మోటార్ సైకిల్ బరువు 175 కిలోలు. ఎత్తు పల్లాలు, గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఇది మెరుగ్గా దూసుకుపోతుంది. ఇది ఆప్ఫనల్ క్విక్‌షిఫ్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు రైడర్లకు అవసరమయ్యే ఫీచర్స్‌ను బైక్‌లో అందించింది.
READ MORE: Ponnam Prabhakar: రంజాన్ సందర్భంగా పటిష్ట చర్యలు.. అధికారులు సమన్వయంతో పని చేయాలి
ఇది ముందు, వెనుక ప్రీలోడ్ సర్దుబాటు కూడా కలిగి ఉంది. రైడర్లకు బైక్‌పై సులభమైన కంట్రోలింగ్ ఇవ్వడానికి ఫ్రంట్ డ్యూయల్ 320 mm డిస్క్‌లు, బ్యాక్ 220 mm డిస్క్ ఏర్పాటు చేశారు. మెరుగైన కంట్రోలింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను అమర్చారు. అప్రిలియా టువోనో 457 ప్యూమా గ్రే, పిరాన్హా రెడ్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ లాంచ్‌తో భారత్‌లో తన మార్కెట్‌ను పెంచుకోవాలని అప్రిలియా కీలక ప్రయత్నాలు చేస్తుంది.