ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. కొత్త మోటార్‌సైకిల్ టువోనో 457ను అధికారికంగా విడుదల చేసింది. ఇది భారత మార్కెట్లో అత్యంత చౌకైన అప్రిలియా బైక్! దీని ప్రారంభ ధర రూ. 3.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.