ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం అయ్యారు. కృష్ణ యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రాంజీ నియామకం అయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ గా ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ప్రొఫెసర్ ఉమా నియామకం అయ్యారు.
Also Read:Russia-Ukraine war: మొదలైన శాంతి చర్చలు.. ఉక్రెయిన్ లేకుండానే చర్చలు
JNTU అనంతపూర్ కు ఇన్ చార్జీ వీసీ గా ఉన్న ఆచార్య సుదర్శన్ రావ్ నే రెగ్యూలర్ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ యూనివర్సిటీ వీసీగా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా ఉన్న వెంకట బసవరావు నియామకం అయ్యారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వీసీ గా ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావ్ లను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.