Tata Altroz iCNG: ప్రతీ భారతీయులు ఓ కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది ఖర్చు, అది ఇచ్చే మైలేజ్. అయితే ప్రస్తుతం ప్రముఖ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టాటా వంటి దిగ్గజ కార్ మేకర్స్ సీఎన్‌జీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ బాలెనో, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి వాటిలో సీఎన్‌జీ కార్లను తీసుకువచ్చింది. తాజాగా దేశీయ దిగ్గజ ఆటో మేకర్ టాటా తన సీఎన్‌జీ కార్ ఆల్ట్రోజ్ ను తీసుకువస్తోంది. ప్రస్తుతం కార్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్‌జీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ట్విన్ CNG సిలిండర్‌లతో ఈ కార్ రాబోతోంది. బుకింగ్ కోసం రూ.21,000 టోకెన్ అడ్వాన్స్ ను సమీపం టాటా షోరూంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నిర్వహించిన ఆటో ఎక్స్ పో 2023లో టాటా ఆల్ట్రోజ్ iCNG ను ఆవిష్కరించింది. టాటా ఆల్ట్రోజ్ దేశంలోనే ట్విట్ CNG సిలిండర్లతో వస్తున్న తొలి కారు. ఒక్కో సిలిండర్ 30 కిలోల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కారు డెలివరీలు మే నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఆల్ట్రోజ్ పెట్రోట్, టర్బో పెట్రోల్, డీజిల్, CNG పవర్‌ట్రెయిన్స్ లో అందుబాటులో ఉంది. ఒక కిలో సీఎన్జీకి 26-27 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.
Read Also: Crime News: ఛీఛీ.. కామ పిశాచులు.. పాతిపెట్టిన శవంపై గ్యాంగ్ రేప్.. చివరికి
ఆల్ట్రోజ్ iCNG థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, గ్యాస్ లీక్ డిటెక్షన్ ఫీచర్, రీఫ్యూయలింగ్ సమయంలో కారు స్విచ్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి మైక్రో స్విచ్ వంటి అదనపు భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇది మూడు సంవత్సరాలు లేదా 100,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో వస్తుంది. XE, XM+, XZ మరియు XZ+ వేరియంట్లలో 4 కలర్లలో అందుబాటులో ఉండనుంది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, లెథెరెట్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఐఆర్‌ఎ కనెక్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను టాటా అందిస్తోంది.
1.2 లీటర్ త్రి సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ తో, CNGని ఉపయోగించుకునేలా రూపొందించారు. 77 బీహెచ్పీ శక్తిని, 97 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ (రూ. 6.45 లక్షలు-9.10 లక్షలు, ఎక్స్-షోరూమ్) కన్నా ఇది రూ. 90,000 అధిక ధర కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకీ బాలెనో, టయోటా గ్లాంజాలకు టాటా ఆల్ట్రోజ్ కు పోటీగా ఉండనుంది.