11 Cops Killed In Blast By Maoists In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మావోలు పోలీసులు లక్ష్యంగా భారీ పేలుడుకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో అరాన్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో మొత్తం 11 మంది పోలీసులు చనిపోయినట్లు సమాచారం. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బీజాపూర్, జగదల్పూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలు మావోయిస్టులకు పెట్టనికోటగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి తగ్గింది. అయితే అదును కోసం చూస్తున్న మావోయిస్టులు ఈ పేలుడుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Manchiryala Crime: మంచిర్యాల మహేష్ హత్య కేసులో ట్విస్ట్.. యువతి వీడియో కలకలం
ఇంప్రూవైడ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఈడీ) బ్లాక్ చేసి ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో మావోలు ఈ దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది పోలీసులతో పాటు వాహనం నడుపుతున్న డ్రైవర్ మరణించారు.
50 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు సమచారం. పేలుడు జరిగిన ప్రదేశంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గోతి ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(జీఆర్డీ) బలగాలు, అద్దెకు తీసుకున్న వాహానంలో ప్రయాణిస్తున్న సంగతి తెలుసుకునే పక్కా ప్రణాళికతో మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి, చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌తో మాట్లాడారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.