Rogue elephant Arikomban captured: కేరళలోని ఇడుక్కి జిల్లా ప్రజలను నానాకష్టాలు పెడుతున్న ఏనుగు ‘అరికొంబన్’ ఎట్టకేలకు చిక్కింది. అధికారులు ఎనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది. ఏనుగును పెరియార్ టైగర్ రిజర్వ్ కు తరలించారు. నిన్న తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం అయిన మిషన్ ఏనుగును గుర్తించలేకపోయింది. అయితే ఆదివారం మళ్లీ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు ఏనుగును గుర్తించారు.
Read Also: Zelensky: రష్యా చేతిలో బందీ కావడం తీవ్ర అవమానకరం..
అరికొంబన్ తో పాటు మరో ఏనుగు చక్కకొంబన్ ను అధికారులు గుర్తించారు. అయితే బాణాసంచాతో చక్కకొంబన్ ను వేరే దారిలోకి పంపించేసి, అరికొంబన్ పైకి మత్తు ఇంజెక్షన్లను ప్రయోగించి అధికారులు పట్టుకోగలిగారు. ఏనుగును పట్టుకునేందుకు శిక్షణ పొంది 4 కుమ్కీ ఏనుగులను ఉపయోగించారు. ఇదిలా ఉంటే పట్టుకున్న ఏనుగును ట్రక్కులో తరలించే సమయంలో పలుమార్లు ప్రతిఘటించింది. ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న అధికారులు మాత్రం విజయవంతంగా మిషన్ పూర్తి చేశారు. ఏనుగు అరికొంబన్ ను పట్టుకునేందుకు ఇడుక్కి జిల్లాలోని చిన్నక్కనాల్, కుమలి సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సీనియర్ వెటర్నరీ అధికారి డా. అరుణ్ జకరియా ఏనుగుపైకి వరస విరామాల్లో మత్తు ఇంజెక్షన్లను కాల్పులు జరిపి పట్టుకోగలిగారు.
అన్నం తినేందుకు అలవాటు పడిన ఈ అరికొంబన్(అరి – బియ్యం, కొంబన్ – ఏనుగు) అని పిలువబడే ఏనుగు బియ్యం కోసం చిన్నక్కనాల్ సమీప ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లపై, రేషన్ దుకాణాలపై దాడులు చేసేది. దీని దాడులను తట్టుకోలేక స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. దీంతో అధికార యంత్రాంగం ఏనుగును బంధించే వేరే అటవీ ప్రాంతానికి తరలించారు.