The Kerala Story: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ‘కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదాస్పదం అయింది. గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ సినిమాకు టాక్సును రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది.
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ ఫైల్స్ ’ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. విడుదలతో పాటే వివాదాలను కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించాయి. ఇదిలా ఉంటే శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమాను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Himanta Biswa Sarma: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తున్నారు.. అయితే రాహుల్ గాంధీ గ్యారెంటీ ఎవరు తీసుకుంటారు..రాహుల్ గాంధీని నిలబెట్టేందుకు సోనియాగాంధీ గత 20 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.
Brij Bhushan: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయాలంటూ ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రెజ్లర్లకు మద్దతుగా రైతులు ఈ రోజు ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి షెషబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీలపై విరుచుకుపడ్డారు. ప్రధాని, విదేశాంగమంత్రులు విదేశీ పర్యటనపై ప్రశ్నలు గుప్పించారు. షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం కోసం యూకేలో ఉండగా, విదేశాంగ మంత్రి బిలావల్ గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనడానికి గురువారం భారతదేశాన్ని సందర్శించారు.
PM Modi: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వరసగా రెండో రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రోజు శనివారం మూడు గంటల పాటు మోదీ రోడ్ షో జరిగింది. దాదాపుగా 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ శనివారం నగరంలో దాదాపు 26 కి.మీ రోడ్‌షో నిర్వహించిన ప్రధానిని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్డుకిరువైపుల బారులు తీరారు. ఆదివారం 10 కిలోమీటర్ల…
King Cobra: ప్రపంచవ్యాప్తంగా 1,47,517 జంతు జాతులలో 41,459 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) తన తాజా నివేదికలో పేర్కొంది. అంతరించి పోయే జాతుల జాబితాలో చాలా వరకు మనం పులులు, సింహాలు, చిరుతల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అయితే ఇందులో ‘కింగ్ కోబ్రా’ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ విషపూరిత సర్పం ఇప్పుడు ప్రమాదం అంచున […]
Asaduddin Owaisi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు, రేపు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ తరుపు నుంచి హుబ్బళి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఆయన కోసం సోనియా గాంధీ శనివారం ప్రచారం చేశారు.
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు, ఆయన్ను అరెస్ట్ చేయాలని 10 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. విపక్షాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు వారి పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రెజ్లర్లకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. పంజాబ్, హర్యానా, యూపీ నుంచి వచ్చే అనేక మంది ఈ సంస్థ నాయకులు ఆదివారం రెజ్లర్లకు…
Russia: రష్యా అధ్యక్షుడిని హతమార్చేందుకు డ్రోన్లను ప్రయోగించిన కొద్ది రోజుల తర్వాత రష్యాలో మరో ప్రముఖుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ రష్యన్ జాతీయవాద రచయిత, జఖర్ ప్రిలేపిన్ ని శనివారం కారుబాంబుతో హతమార్చాలని చూశారు. ఈ ఘటనలో ఆయన గాయపడగా.. కారు నడుపుతున్న డ్రైవర్ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్ తరుపున తాను పనిచేస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు.