Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే, అతని కుటుంబాన్ని చంపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని ఆరోపించింది. చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ హిస్టరీ షీటర్ అయిన మణికంఠ రాథోడ్ ను రంగంలోకి దింపిందని బీజేపీని కాంగ్రెస్ నిందించింది. మనికంఠ అనుచిత పదజాతంలో ఖర్గేను దూషించాడని ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్ లను బెంగళూర్…
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో అట్టుడుకుతోంది. బుధవారం నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఏదో చోట ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. శనివారం బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం అయింది. మరోవైపు రాజౌరీలో శుక్రవారం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. రాజౌరీ ఎన్కౌంటర్ ఇప్పటికే 9 పారా కమాండో దళానికి చెందిన నలుగురు జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Rajouri terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఏడు నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతాబలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో సరిహద్దుల్లోని అడవులను స్కాన్ చేస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజౌరీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం ఉగ్రవాదుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే రాజౌరీతో పాటు బారాముల్లాలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
IT Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఆర్థికమాంద్యం భయాలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఐటీలో సంక్షోభానికి కారణం అవుతున్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను విసిరి అవతలపారేశాయి.
Rains: వేసవి కాలంలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో నమోదు అయ్యే వర్షాల కన్నా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయినట్లు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 3 వరకు సాధారణం కన్నా 28 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయిందని తెలిపింది.
King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి బ్రిటన్ సిద్దం అయింది. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, రాజకుటుంబీకుల మధ్య ఈ రోజు ఆయన పట్టాభిషేకం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్ ఖడ్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కింగ్ ఛార్లెస్-3, ఆయన భార్య రాణి కెమిల్లా ధరించే కిరీటాలపై అందరి ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో మొత్తం మూడు కిరీటాలు ఉపయోగించనున్నారు. ఇందులో రెండు రాజుకు సంబంధించినవి కాగా.. ఒక దానిని రాణి ధరిస్తారు.
RSS: సుప్రీంకోర్టులో ప్రస్తుతం స్వలింగ వివాహాల చట్టబద్ధతపై విచారణ కొనసాగుతోంది. దీన్ని కేంద్రంతో పాటు సమాజంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇది కేవలం అర్బన్ కమ్యూనిటీలో కొంతమందికి మాత్రమే పరిమితం అయిందని, దేశంలో మెజారిటీ ప్రజల మనోభావం కాదని, చట్టబద్ధత కల్పించే హక్కు పార్లమెంట్ ది అని దీంటో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కేంద్రం తెలిపింది. అయితే వీరి హక్కులపై ఓ కమిటీని నియమిస్తామని ఇటీవల కేంద్ర అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.
King Charles Grand Coronation Ceremony: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయింది. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ పట్టాభిషేకానికి భారీగా ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల ప్రముఖులు లండన్ చేరుకున్నారు. భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్ఖడ్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. వీరికి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం…
Bilawal Bhutto: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ హాజరయ్యారు. దాదపుగా 12 ఏళ్ల తరువాత ఓ పాకిస్తాన్ ప్రతినిధి ఇండియాకు రావడం ఇదే తొలిసారి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాజౌరిలో ప్రారంభమైన ఎన్కౌంటర్ కొనసాగుతుండగా.. శనివారం బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ ప్రారంభం అయినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. బారాముల్లా ఎన్కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఉగ్రవాదలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.