Harish Rao : డాక్టర్ మమతకు హరీష్ రావు సెల్యూట్.. ‘దేవుళ్లు ఎందుకంటారో నిరూపించారు.!’
- పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రాణాపాయం నుంచి రక్షణ
- డాక్టర్ మమతా రెడ్డి సేవలను కొనియాడిన హరీష్ రావు
- సీపీఆర్‌తో గుండెచప్పుడును పునరుద్ధరించిన వైద్య బృందం
- త్వరగా కోలుకోవాలని పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రాణాపాయం తప్పించి, ఆయన ప్రాణాలను కాపాడిన డాక్టర్ మమతా రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా డాక్టర్ మమతా రెడ్డికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడటంలో ఆమె అసాధారణమైన అంకితభావంతో, తీవ్రమైన ఒత్తిడిలో కూడా అచంచలమైన నిబద్ధతను, సమయస్ఫూర్తిని ప్రదర్శించారని హరీష్ రావు కొనియాడారు.
అనేక దఫాలుగా సీపీఆర్ (CPR) చేసిన తర్వాత కూడా ఆశ వదులుకోకుండా, నిరంతర శ్రమతో సుదర్శన్ రెడ్డి గుండెచప్పుడును విజయవంతంగా పునరుద్ధరించడం ఒక వైద్య అద్భుతమని ఆయన అభివర్ణించారు. డాక్టర్ మమతా రెడ్డి ప్రదర్శించిన కరుణ, పట్టుదల, పోరాట స్ఫూర్తి వైద్యులను సమాజంలో ఎందుకు సజీవ దేవుళ్లుగా భావిస్తారో మరోసారి నిరూపించాయని హరీష్ రావు పేర్కొన్నారు. వైద్య వృత్తికే ఆదర్శంగా నిలిచిన డాక్టర్ గారికి తన ప్రగాఢ గౌరవ వందనాలు తెలుపుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని “త్వరగా కోలుకోండి, పెద్ది అన్న” అని ఆకాంక్షించారు.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!