Kanpur: ఉత్తర్ ప్రదేశ్ లో 100 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదైంది. కాటికి కాలి చాపే వయసులో పోలీస్ ఎఫ్ఐఆర్ లోకి ఎక్కింది. సరిగ్గా నడవడం రాని, కళ్లు సరిగ్గా కనిపించని 100 ఏళ్ల వృద్ధురాలు చంద్రకాళి రౌడీయిజం చలాయించింది. ఓ భూతగాదా విషయంలో ఆమెపై మాధురి అనే మహిళ కేసు పెట్టింది. ఈ వివాదంతో రూ.10 లక్షలు ఇవ్వాలని మాధురిని బెదిరించిందనే ఆరోపణలపై పోలీసులు వృద్దురాలి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
Read Also: Ashish Vidyarthi: 60 ఏళ్ల వయస్సులో ‘పోకిరి’ విలన్ రెండో పెళ్లి.. పద్మావతి హ్యాపీయేనా
కాన్పూర్ మీర్జాపూర్ లోని నాయిబస్తీ నివాసి అయిన చంద్రకాళి కుటుంబ, మాధురి అనే యువతికి మధ్య భూవివాదం నడుస్తోంది. ఈ ప్లాట్ తన పేరుతో రిజిస్టర్ అయి ఉందని, చంద్రకాళి కుటుంబ సభ్యులు నకిలీ పత్రాలతో భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని మాధురి ఆరోపించింది. మే 6న గేటు పగలగొట్టి తన ప్లాట్ లోకి ప్రవేశించారని మాధురి, వృద్ధురాలైన చంద్రకాళి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. ఆ తరువాతి రోజు మాధురి, ఆమె భర్త ప్లాట్ లో నిర్మాణ పనులు చేపట్టగా.. 10-12 మంది మనుషులతో దాడి చేశారని, పనిని ఆపేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. చంద్రకాళి కూతురు మమతా దూబేతో పాటు సుష్మా తివారీ, క్రిష్ణ మురారిలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
వీరందతా దోపిడి ముఠాను నడుపుతున్నారని, ఇళ్లు కట్టుకోవాలంటే రూ.5-10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని, రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఇట్లు కట్టుకోనివ్వనని వృద్ధురాలు చంద్రకాళి బెదిరించిందని, ప్లాటు, ప్రాణాలు పోతాయని బెదిరించిందని బాధితురాలు ఆరోపించింది. వృద్ధురాలిపై కేసు విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎఫ్ఐఆర్ నుంచి ఆమె పేరును తొలగించారు. వృద్ధరాలు తన వాదనల్ని కమీషనర్ బీపీ జోగ్ దండ్ ముందు వినిపించింది. ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, విచారణ జరుపుతున్నామని అన్నారు.