Crocodile Attack: ఆస్ట్రేలియా దేశంలో మొసళ్లు, షార్క్ దాడులు తరుచుగా జరుగుతున్నాయి. వీటి బారిన పడిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ రిసార్ట్ లో ఓ వ్యక్తి స్నార్కెలింగ్(ఆక్సిజన్ మాస్క్ తో ఈతకొడుతుండగా) చేస్తుండగా హఠాత్తుగా మొసలి దాడి చేసింది. మార్కస్ మెక్ గోవన్ అనే 51 ఏళ్ల వ్యక్తి మొసలి దాడికి గురయ్యాడు. 17 మంది ఈతగాళ్లతో స్మిమ్మింగ్ చేస్తున్న సమయంలో వెనకనుంచి వచ్చిన మొసలి దాడి చేసింది.
51 ఏళ్ల మార్కస్ మెక్‌గోవాన్ తన భార్య మరియు స్నేహితులతో కలిసి కేప్ యార్క్ తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్లెస్ హార్డీ దీవులకు సమీపంలో స్నార్కెలింగ్ చేస్తున్నప్పుడు శనివారం దాడికి గురయ్యాడు. ముందుగా తాను షార్క్ అనుకున్నానని, కానీ ఆ తరువాత మొసలి అని గుర్తించానని, మొసలి దవడలను గట్టిగా కొద్దిసేపు వరకు తెరిచానని, ఆ తరువాత కూడా మళ్లీ మొసలి దాడి చేసేందుకు వచ్చిందని అయితే ఈ సారి చేతులతో బలవంతంగా నెట్టేశానని తెలిపారు. ఆ తరువాత సహాయం కోసం తన అరుపులను విన్న తరువాత పడవ వచ్చి రెస్క్యూ చేసిందని చెప్పాడు. ఈ దాడిలో ఆయన తలకు, చేతికి గాయాలు అయ్యాయి.
సముద్రంలో మొసళ్లను గుర్తించడం చాలా కష్టమని, ఎందుకంటే అవి రోజుకు పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో ఇటీవల కాలం మొసళ్ల దాడులు పెరిగాయి. 1974లో మొసళ్ల వేట నిషేధించబడినప్పటి నుండి, క్వీన్స్ లాండ్ రాష్ట్రంలో మొసళ్ల సంఖ్య దాదాపు 5,000 జంతువుల నుండి నేడు దాదాపు 30,000కి పెర