Rs.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మార్చుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Google Pay: ఆధార్ కార్డు సహాయంతో ఇకపై ‘గూగుల్ పే’ని యాక్టివేట్ చేసుకోవచ్చని మంగళవారం ఆ కంపెనీ తెలిపింది. యూపీఐ యాక్టివేట్ కోసం ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ప్రారంభించింది.
MSP Increase: ఖరీఫ్ పంటలపై కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పెసర పంటకు 10.4 శాతం, వేరుశెనగ 9 శాతం , నువ్వులు శాతం, వరి 7 శాతం, సోయాబీన్, రాగులు, జొన్న, పొద్దు తిరుగుడు పంటకలకు సుమారుగా 6-7 శాతం చొప్పున 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఎంఎస్పీని…
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థ మరోసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మద్రాస్ ర్యాంక్ సాధించింది. వరసగా ఐదో ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2023లో దేశంలోని వివిధ విద్యాసంస్థలకు ర్యాంకుల్ని కేటాయించింది.
Mukhtar Ansari: మాఫియా డాన్, రాజకీయవేత్త, గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీని హత్య కేసులో దోషిగా తేల్చింది వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు. కాంగ్రెస్ నాయకుడిని ఆగస్ట్ 3, 1991లో హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ ని వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి బయట కాల్చి చంపారు.
Odisha: ఒడిశాలో బాాలాసోర్ రైలు ప్రమాదం విషాదం మరిచిపోక ముందే మరో ట్రైన్ పట్టాలు తప్పింది. ఇది కూడా ఒడిశా రాష్ట్రంలోనే జరిగింది. బారాగఢ్ లో గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది