Mumbai Most Expensive Indian City For Expats: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది.
Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాద శక్తులు రోజురోజుకు బలపడుతున్నాయి. విదేశాలు వేదికగా భారతదేశంపై విషం చిమ్ముతున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాల్లో భారత విద్వేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఖలిస్తాన్ రిఫరెండ పేరిట నానా హంగామా సృష్టిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేని పార్టీని దేశంలో చూపించండి అంటూ దేవెగౌడ సవాల్ విసిరారు. దేశం మొత్తంలో ఒక్కపార్టీనైనా చూపించాలని, అప్పుడు నేను సమాధానం చెబుతానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న విపక్ష ఐక్యత ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు దేవెగౌడ మంగళవారం సమధానమిచ్చారు.
Tamil Nadu: మతాంతర సంబంధాలనికి తల్లిదండ్రులు నో చెప్పడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గాయత్రి(23),విద్యా(21) అనే ఇద్దరు సోదరీమణులు తిరుప్పూర్‌లోని ఒక టెక్స్టైల్ మిల్లులో పనిచేస్తున్నారు. అక్కడే వారితో పనిచేస్తున్న ముస్లిం కమ్యూనిటికి చెందిన ఇద్దరు సోదరులతో ప్రేమలో పడ్డారు.
Madhyapradesh: మధ్యప్రదేశ్ సెహెర్ జిల్లాలోని ముంగోలి గ్రామంలో 2 ఏళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి 300 అడుగుల లోతున్న బోరుబావిలో మంగళవారం పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గత 24 గంటల నుంచి బాలికను బయటకు తీసేందుకు అధికారులు కష్టపడుతున్నారు. 50 అడుగుల పీట్ల లోతులో చిన్నారి చిక్కుకుపోయింది. అంతకుముందు 20 ఫీట్లలో ఉన్న చిన్నారి, ఆ తరువాత మరింత లోతుకు జారిపోయింది.
Gangster Shot Dead: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్‌స్టర్ ని హత్య చేశారు దుండగులు. మాఫియాడాన్, గ్యాంగ్ స్టర్, ఇటీవల హత్య కేసులో దోషిగా తేలిన ముఖ్తార్ అన్సారీకి అతిముఖ్యమైన సన్నిహితుడిగా పేరొందిని సంజీవ్ మహేశ్వీరీ అలియాస్ సంజీవ్ జీవాను లక్నో కోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. ముజఫర్‌నగర్‌కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ మాజీ మంత్రి బ్రహ్మదత్ ద్వివేది హత్యల కేసులో అరెస్టయ్యాడు. ద్వివేది హత్య కేసులో జీవా, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ్‌సింగ్‌లకు…
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. ఈ నెల 12న పెళ్లికావాల్సిన యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా కిడ్నాప్ అయిన యువతిని ఎత్తుకుని ఏడడుగులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి పెళ్లైపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో నక్సల్స్, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ-పామెడ్-యూసర్ ట్రై జంక్షన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఐజీ బస్తర్, పి సుందర్రాజ్ వెల్లడించారు.