Himanta Biswa Sarma: కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై మరోసారి అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ విరుచుకుపడ్డారు. తాజాగా కాంగ్రెస్ చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. ఆ ట్వీట్ లో భారతదేశం మ్యాపులో ఈశాన్య రాష్ట్రాలు లేకపోవడంపై హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rajeev Chandrasekhar: జమ్మూకాశ్మీర్‌లో అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ ఐదు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ లో నలుగురు ఆర్మీ అధికారులు వీర మరణం పొందారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల్లో దాగున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
Child Deaths: మహారాష్ట్రలో చిన్నారుల మరణాలు కలకలం రేపుతున్నాయి. నందుర్బార్ లోని సివిల్ ఆస్పత్రిలో గత మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. ఈ ఉదంతంపై నందుర్బార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సావన్ కుమార్ స్పందించారు. పిల్లల మరణాలకు అనేక ఆరోగ్య సమస్యలు కారణమవుతున్నాయని వెల్లడించారు.
Tamil Nadu: తమిళనాడులో తొలిసారిగా ముగ్గురు మహిళలు ఆలయ పూజారులుగా మారారు. కులాల అడ్డుగోడలను ఛేదించి దేవుడి గర్భగుడిలోకి ప్రవేశించి లింగసమానత్వాన్ని తీసుకురానున్నారు. దేవుడి సేవ చేసుకునే భాగ్యం కొన్ని కులాలకే కాదు అందరికి ఉందనే నిజాన్ని చాటి చెప్పేందుకు ఈ ముగ్గురు మహిళలు సిద్దమయ్యారు. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే యువతులు తమిళం, సంస్కృతం చదువుతూ శ్రీరంగం ఆలయంలో ఒక ఏడాది కోర్సును పూర్తి చేశారు. Read Also: Sabarimala: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు జారీ […]
Sabarimala: కేరళలో నిపా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆరుగురికి నిపా వైరస్ సోకగా.. ఇద్దరు మరణించారు. మరో నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిపా నేపథ్యంలో శబరిమల యాత్రికులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమల యాత్ర కోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్వ బోర్డును కోర్టు కోరింది.
INDIA Bloc: ఇండియా కూటమి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తెలిపారు. ర్యాలీకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారని, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
One Nation One Election:‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై కేంద్రం నియమించిన కమిటీ తొలిసారిగా సమావేశం కాబోతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే రోజే సమావేశం జరగనుంది. సెస్టెంబర్ 23న జమిలి ఎన్నికలకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ భేటీ అవుతుంది.
Baramulla Encounter: బారాముల్లా ఎన్కౌంటర్ లో భద్రత బలగాలకు కీలక విజయం లభించింది. పీఓకే నుంచి ఇండియాలో చొరబడేందుకు ప్రయత్నించి ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శనివారం బారాముల్లాలోని ఊరీ సెక్టార్ లో ఎల్ఏసీ వెంబడి ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేశాయి.
Madras High Court: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించాయి. ఇదిలా ఉంటే సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సనాతన ధర్మం అనేది దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వతమైన కర్తవ్యాల సమాహారమని అలాంటి విధులను ఎందుకు నాశనం చేయాలని ఆలోచించారు’’ అంటూ వ్యాఖ్యానించింది.
TS Singh Deo: కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ప్రధాని నరేంద్రమోడీపై భారీగా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కేంద్ర చేపడుతున్న ప్రాజెక్టులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’లకు ప్రధాని మోడీ గురువారం శంకుస్థాపను చేశారు. వీటితో పాటు ప్రధాని అనేక భారీ ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు.