INDIA Bloc: ఇండియా కూటమి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తెలిపారు. ర్యాలీకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారని, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
Read Also: Divorce Rate : ప్రపంచంలో ఎక్కువ మంది విడాకుల తీసుకునే దేశాలు ఇవే..ఇండియా నెంబర్ ఇదే!
ఇదిలా ఉంటే భోపాల్ ర్యాలీ రద్దు చేసుకోవడంపై కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని మధ్యప్రదేశ ప్రజలు సహించరని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నందుకే ర్యాలీని రద్దు చేసుకుంటానని బీజేపీ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా ఉందని, పోస్టర్లలో ఎవరెవరి ఫోటోలు చేర్చాలనే దానిపై కూటమి పోరాడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీలో అందరూ ఎన్నికల పనిలో నిమగ్నమై ఉన్నారని అన్నారు.
మరోవైపు ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 గణేష్ చతుర్థి రోజున కాంగ్రెస్ రాష్ట్రంలో ‘జన్ ఆక్రోశ్ యాత్ర’లకు శ్రీకారం చుట్టింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 7 యాత్రలు, రాష్ట్రంలోని 230 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా జరిగేటట్లు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ గోవింద్ సింగ్ సహా సీనియర్ నేతలు దీనికి నాయకత్వం వహించననున్నారు.