Aditya L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 తన లక్ష్యం దిశగా పయణమైంది. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో చక్కర్లు కోట్టిన శాటిలైట్ ఇప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటిసే సూర్యుడి దిశగా వెళ్తోంది. భారత మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్(L1) దిశగా వెళ్తోందని ఇస్రో మంగళవారం ప్రకటించింది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్((TL1I) విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది.
UNESCO: యునెస్కో(UNESCO) ప్రపంచ వారతసత్వ సంపదలో మరో రెండు భారతీయ ప్రదేశాలకు చోటు లభించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది. కర్ణాటక హొయసల రాజవంశానికి చెందిన ఆలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ని వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో(UNESCO). ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తెలిపింది.
Chicken Shawarma: ఇటీవల కాలంలో పిల్లలు స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. కొన్ని సందర్బాల్లో ఇవి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు కూడా వీటిని కొనిచ్చేందుకు వెనకాడటం లేదు. అయితే పిల్లల ఆరోగ్యాన్ని, ప్రాణాల్ని పణంగా పెడుతున్నామని పేరెంట్స్ కి అర్థం కావడం లేదు.
India: ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కెనడా చేస్తున్న ఆరోపణలు అసబద్ధమైనవి, ప్రేరేమితమని భారత విదేశాంగ శాఖ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. భారతదేశానికి చట్టబద్దమైన పాలనపై బలమైన నిబద్ధత ఉందని పేర్కొంది. ‘‘కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, వారి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను చూశామని, కెనడాలోని ఏదైన హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి’’ అని ఒక ప్రకటనలో…
Kota: మెదడుకు ఎక్కని చదువులు, తీవ్ర ఒత్తిడి, ఎక్కడ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేమో అనే భయం ఇలా నీట్ విద్యార్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా రెండు పదులు నిండని వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ హబ్ గా పేరున్న రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Hardeep Singh Nijjar: ఓ ఖలిస్తానీ హత్య ఇండియా-కెనడా సంబంధాల మధ్య చిచ్చు పెట్టింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని జూన్ నెలలో కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది.
Women's Reservation Bill: మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్ధాలుగా ఉన్న మహిళా బిల్లుకు కీలక ముందడుగు పడింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించబడిన మహిళా బిల్లుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. మరో నేటి నుంచి మరో నాలుగు రోజులు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురాబోంది.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. సోమవారం ఓ కార్యక్రంలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కూటమిలోకి తమను ఆహ్వానించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Punjab: ఖలిస్తానీ ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలో సోమవారం స్థానికి కాంగ్రెస్ నాయకుడిని తన నివాసంలో కాల్చి చంపారు. బల్జీందర్ సింగ్ బల్లి అనే కాంగ్రెస్ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం దాలా గ్రామంలోని బల్లి నివాసంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇతను అజిత్వాల్ లోని కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
Canada: కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే దౌత్యసంబంధాలు అనుమానంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని భారత్ వ్యతిరేఖంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత మొదలైంది.