Child Deaths: మహారాష్ట్రలో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు.. 3 నెలల్లో 179 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Deaths: మహారాష్ట్రలో చిన్నారుల మరణాలు కలకలం రేపుతున్నాయి. నందుర్‌బార్ లోని సివిల్ ఆస్పత్రిలో గత మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. ఈ ఉదంతంపై నందుర్‌బార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సావన్ కుమార్ స్పందించారు. పిల్లల మరణాలకు అనేక ఆరోగ్య సమస్యలు కారణమవుతున్నాయని వెల్లడించారు.
తక్కువ బరువుతో పుట్టడం, పుట్టుకలో వచ్చే అస్పిక్సియా, సెప్సిస్, శ్వాసకోశ వ్యాధులు ప్రాథమిక కారణాలని వైద్యాధికారులు తెలిపారు. నందుర్‌బార్ జిల్లాలో జూలై నెలలో 75 మంది, ఆగస్టులో 86 మంది, సెప్టెంబర్ లో 18 మంది మొత్తంగా మూడు నెలల్లో 179 మంది మరణించారు. మరణాల్లో 70 శాతం పిల్లలు పుట్టిన 0-28 రోజుల మధ్య వయసులో సంభవించాయి. మహారాష్ట్రలో ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ నందుర్‌బార్ జిల్లాలో గణనీయంగా గిరిజన జనాభా ఉంది. ఇక్కడి స్రీలల్లో సీకెల్ సెల్ ఎనీమియా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
Read Also: Tamil Nadu: కులం అడ్డుగోడలు ఛేదించారు.. తొలిసారి ఆలయ పూజారులుగా ముగ్గురు మహిళలు..
ఈ ప్రాంతంలో రాష్ట్రంలో అత్యధిక పోషకాహార లోపం ఉందని వైద్యులు తెలిపారు. మరణాల్లో 20 శాతం సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల సంభవిస్తున్నాయని వైద్యసౌకర్యాలు సరిగా లేకపోవడం, ఇంటి దగ్గర ప్రసవాలు చేయడం, సామూహిక వలసలు కూడా ప్రధాన కారణంగా ఉన్నాయని సావన్ కుమార్ తెలిపారు. ఈ సవాళ్లను అధిగమించి పసివాళ్ల ప్రాణాలు కాపాాడాల్సి ఉందన్నారు.
దీని కోసం నందుర్‌బార్ జిల్లాలో అధికారులు ‘మిషన్ లక్ష్య 84’ పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిశువుల మరణాలకు కారణాలను పరిష్కరించడంతో పాటు, ఆరోగ్య సేవల్ని మెరుగుపరచడం, శిశువుల ఆరోగ్యానికి మెరుగైన సౌకర్యాలు కల్పించేలా లక్ష్యం పెట్టుకున్నారు. ప్రసవానికి 42 రోజుల ముందు, ప్రసవం తర్వాత 42 రోజులు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు తెలిపారు. ఈ మరణాలపై స్థానిక ఎమ్మెల్యే అంషా పద్వీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!