Madras High Court: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించాయి. ఇదిలా ఉంటే సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సనాతన ధర్మం అనేది దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వతమైన కర్తవ్యాల సమాహారమని అలాంటి విధులను ఎందుకు నాశనం చేయాలని ఆలోచించారు’’ అంటూ వ్యాఖ్యానించింది.
‘సనాతన వ్యతిరేకత’ అనే అంశంపై విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకోవాలని స్థానికి ప్రభుత్వం ఆర్ట్స్ కాలేపజీ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఇళంగోవన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్ శేషసాయి ధర్మాసనం విచారణ చేపట్టింది. సనాతన ధర్మం కేవలం కులతత్వం, అంటరానితనాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందనే భావనను తిరస్కరిస్తున్నానని పేర్కొన్నారు.
Read Also: iPhone 12 Radiation : త్వరలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్.. యాపిల్ కీలక నిర్ణయం
సమాన పౌరులున్న సమాజంలో అంటరానితనాన్ని సహించలేమని జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ఎక్కోడో చోట అంటరానితనాన్ని అనుమతించినా, రాజ్యాంగంలోని 17వ ఆర్టికల్ అంటరానితనాన్ని నిర్మూలిస్తుందని అన్నారు. వాక్ స్వాతంత్య్రం ప్రాథమిక హక్కు, అయితే అది ద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదని, ప్రత్యేకించి మతపరమైన అంశాలకు సంబంధించి, ఇలాంటి ప్రసంగాల వల్ల ఎవరూ గాయపడకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని న్యాయమూర్తి నొక్కి చెప్పారు. ప్రతీ మతం విశ్వాసం ఆధారంగా స్థాపించబడిందని అన్నారు.
ఇటీవల తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. దీనికి తోడు ఆ పార్టీ నేత ఏ రాజా సనాతనధర్మ ఎయిడ్స్, కష్టు వంటిదని కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బీజేపీ, పలు హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.