Scrub Typhus: ఒడిశా రాష్ట్రాన్ని ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా సుందర్ఘర్ జిల్లాలో మరో 11 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 180కి చేరింది. తాజాగా 59 శాంపిళ్లను పంపించగా 11 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది. ఎక్కువగా కేసులన్నీ సుందర్ఘర్ జిల్లాలో నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు.
Asaduddin Owaisi: దేశంలో థర్డ్ ఫ్రంట్ కు స్థానం ఉందని ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని పార్టీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కి సూచించినట్లు ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇండియా కూటమి దేశంలోని రాజకీయ శూన్యతను పూరించలేకపోయిందని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తే ఇది భర్తీ అవుతుందని ఆయన అన్నారు.
PM Vishwakarma scheme: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన పుట్టిన రోజు కానునగా హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు.
Vivek Ramaswamy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ జరుగుతోంది. ఈ సారి అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు
Anantnag encounter: జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా కోకెర్నాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. దాదాపుగా 5 రోజులు గడుస్తున్నా.. ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో పాటు ఒక జవాన్ మరణించారు
Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
Anantnag Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ 5వ రోజుకు చేరుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే నలుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఎలాగైన ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే వ్యూహాలతో భద్రతాసిబ్బంది ఉంది. అయితే దట్టమైన అడువులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్నాయి. జింగిల్ వార్ఫేర్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైన్యానికి సవాల్ విసురుతున్నారు.
Libya Floods: లిబియా దేశం మృతుల దిబ్బగా మారిపోయింది. డేనియల్ తుఫాన్ జలప్రళయాన్ని సృష్టించింది. వర్షాల ధాటికి రెండు జలశయాలు బద్దలైపోయాయి. దీంతో ప్రజలు వరదల్లో కొట్టుపోయారు.
Indian Student Death: భారతీయ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కందుల అమెరికాలో మరణించడం, ఆ తరువాత అక్కడి పోలీస్ అధికారి ఆమె మరణం గురించి హేళన చేస్తూ, చులకనగా మాట్లాడటం ఇటు ఇండియాలో, అటు అమెరికాలో వైరల్ గా మారింది. జనవరి నెలలో పెట్రోలింగ్ చేస్తున్న కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అయితే పోలీస్ అధికారి ఆమె మరణాన్ని తేలిక చేస్తూ మాట్లాడటం,
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజులో 73వ ఏట అడుగుపెట్టారు.రాష్ట్రపతితో పాటు బీజేపీ పార్టీ నేతలు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. దేశ నాయకుల