Apple iPhone 15: యాపిల్ సంస్థ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్లు ఎక్కువగా వేడవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. హీట్ కావడానికి కారణాలను గుర్తించామని, దీంతో పాటు ఐఓఎస్ 17 సాఫ్ట్ వేర్‌లోని బగ్ ని రాబోయే అప్‌డేట్ లో పరిష్కరించనున్నట్లు యాపిల్ తెలిపింది. కొత్త ఫోన్లు బాగా వేడిక్కుతున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాలు వచ్చాయి. అయితే ప్రారంభంలో కొన్ని రోజులు వేడిగా అనిపించవచ్చని, డివైస్ సెట్టింగ్, రీస్టోరింగ్ యాక్టవిటీ కారణంగా బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ పెరిగిందని సంస్థ తెలిపింది.
Read Also: Pak Army Chief: పాక్ నుంచి ఉగ్రవాదాన్ని తొలగిస్తాం.. బలూచిస్తాన్ పేలుళ్లపై పాక్ ఆర్మీ చీఫ్
దీనితో పాటు థర్డ్ పార్టీ యాప్స్ కొన్ని అప్‌డేట్స్ ఉన్నాయని, ఇవి సిస్టమ్ ఓవర్ లోడ్ కి కారణమవుతుందని ఆపిల్ శనివారం తెలిపింది. దీనిని పరిష్కరించేందుకు యాప్ డెవలపర్లతో కనిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. థర్డ్ పార్టీ యాప్స్ గేమ్ ఆస్పాల్ట్ 9, మెటా ఇన్‌స్టాగ్రామ్, ఉబెర్ సమస్యకు కారణమవుతున్నాయని, ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే తన యాప్ సమస్యల్ని సెప్టెంబర్ 27న పరిష్కరించింది. రాబోయే ఐఓఎస్ 17 బగ్ ఫిక్స్ అప్డేట్ హీటింగ్ సమస్యల్ని పరిష్కరించడానికి ఫోన్ పర్ఫామెన్స్ ని తగ్గించదని వెల్లడించింది.
ఐఫోన్ 15 ప్రొ, ప్రోమాక్స్ ఫోన్ల డిజైన్ వల్ల ఓవర్ హీటింగ్ సమస్యలు రావని, గత మోడళ్లలోని స్టెయిన్ లెస్ స్టీల్ తో పోలిస్తే కొత్త ఫోన్లలోని టైటానియం షెల్స్ హీటింగ్ సమస్యల్ని పరిష్కరిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సమస్యలు ఫోన్ల భద్రత రిస్క్ కాదని దీర్ఘకాలికంగా పనితీరుపై ప్రభావం చూపదని ఆపిల్ తెలిపింది.