Crime: 15 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంతో చోటు చేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ మంగళవారం సిబ్బంది క్వార్టర్స్‌లో మృతి చెంది కనిపించింది. ఆమె మృతదేహం నగ్న స్థితిలో లభించింది. ఈ సంఘటన పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు సాంకేతిక నిఘా ఉపయోగించి అమ్రేలికి చెందిన మోహాన్ పార్ఘిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Read Also: Bareilly violence: “ఐ లవ్ ముహమ్మద్” అల్లర్లకు ముందుగానే ప్లాన్..
దర్యాప్తులో మహిళా కానిస్టేబుల్‌కు నిందితుడికి 2012లో కాలేజీ రోజుల నుంచి సంబంధం ఉన్నట్లు తేలింది. ఇరువురు ప్రేమించుకున్నారు, కానీ 2015లో మోహన్‌కు మరో మహిళతో వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మహిళా కానిస్టేబుల్, నిందితుడు మోహన్ తిరిగి కలుసుకున్నారు. వీరిద్దరు తమ అక్రమ సంబంధాన్ని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు.
మృతురాలు తన అన్న, వదినలతో కలసి ఉంటోంది. రెండు రోజలు క్రితం వీరిద్దరు గ్రామానికి వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే మోహన్‌ను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహం విషయంలో ఈ జంట మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. తాను వివాహితుడైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతోనే గొంతుకోసి చంపినట్లు మోహన్ అంగీకరించాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.