Rahul Gandhi: “ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, చైనాపై ప్రశంసలు”.. కొలంబియాలో రాహుల్ గాంధీ..
- భారత్ ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ విమర్శలు..
- ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపణ..
- కొలంబియాలో రాహుల్ గాంధీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాల్లో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై దాడి భారత్‌కు అతిపెద్ద ముప్పు అని అన్నారు. భారత్‌లో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విధానం అందరికి స్థానం కల్పిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Read Also: Vaayuv Tej : వరుణ్ తేజ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా?
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
భారత్‌ని చైనాతో పోలుస్తూ.. భారత్ 1.4 బిలియన్ల జనాభాను కలిగి ఉంది, అపార అవకాశాలు ఉన్నాయని, కానీ భారత్ చైనాతో పూర్తిగా భిన్నంగా ఉందని, చైనా వ్యవస్థ కేంద్రీకృతమై ఉందని, భారత్ తో మాత్రం వికేంద్రీకరణ ఉందని, వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నాయని, ఇది సంక్లిష్టమైన వ్యవస్థ అని అన్నారు. భారత్‌లో భిన్నమైన ఆచారాలు, మతాలు, ఆలోచనలు ఉన్నాయని, ఇవి వ్యక్తమయ్యే స్థలం కావాలని అని అన్నారు. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూల్చివేయాలనే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భిన్న మతాలు, సంప్రదాయాలను ప్రోత్సహించడం భారత్‌కి చాలా అవసరమని, చైనా లాంటి నియంతృత్వం భారత్‌లో కుదరదని ఆయన అన్నారు. ప్రపంచ నాయకత్వాన్ని అందుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని, గ్లోబల్ లీడర్ షిప్ రేసులో చైనా ముందు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. చైనా కన్నా భారత జనాభానే ఎక్కువ అని ఆయన అన్నారు.
ఎనర్జీ ట్రాన్సిషన్ సమయంలో సామ్రాజ్యాలు ఏర్పడుతాయని, బ్రిటిష్ స్టీమ్ ఇంజన్, బొగ్గును నియంత్రించి ప్రపంచశక్తిగా మారిందని, అమెరికన్లు తరువాత పెట్రోల్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో ఆధిపత్యం సాధించారని, ఇప్పుడు ఫ్యూయెల్ ట్యాంక్ నుంచి బ్యాటరీకి మారుతున్న సమయంలో చైనా, అమెరికా పోటీ పడుతున్నాయని, ఈ పోటీలో చైనా ముందుంది అని చెప్పారు. చైనా పొరుగు దేశం కావడం వల్ల, అమెరికా భాగస్వామిగా ఉండటం వల్ల, భారత్ ఈ రెండు శక్తుల మధ్య నిలుస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!