PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11 దాడులకు తెగబడ్డారని అన్నారు.
Asaduddin Owaisi: ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్, ఓ కేసులో శ్రీ మహా విష్ణువు గురించి వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలనే పిటిషన్‌పై..‘‘ మీరు విష్ణువు భక్తులు కదా, విష్ణువునే ఏమైనా చేయమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Illicit affair: సమాజంలో కొందరి ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటోంది. వావీవరసలు మరిచి ప్రవర్తిస్తున్న తీరు మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇవి హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్గంజ్లో కూడా ఇలాంటి ఓ సంఘటన జరిగింది. అత్తగారితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.
Jammu Kashmir: దక్షిణ కాశ్మీర్‌లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు.
Pakistan: పాకిస్తాన్ పెంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు. బలూచిస్తాన్‌లో ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆర్మీ కూడా భయపడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, సైన్యం టార్గెట్‌గా తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ చతికిలపడుతోంది.
Pakistan Minister: ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. ఆ దేశ ముఖ్య నేతలు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత దాడి సమయంలో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన నవ్వుల పాలైన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత చరిత్ర తెలియకుండా మాట్లాడి నవ్వులపాలయ్యారు. ‘‘ఔరంగజేబు సమయంలో తప్పా, భారత్ ఎప్పుడూ ఐక్యం లేదు’’ అని అన్నారు.
Railways: మీరు ప్రయాణం కోసం రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు, హఠాత్తుగా వెళ్లాల్సిన కార్యక్రమం తేదీ మారింది. అలాంటి సమయంలో జర్నీ డేట్ మార్చడానికి గతంలో వీలు కలిగేది కాదు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందుల్ని తీర్చడానికి భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా బుక్ చేసుకున్న టికెట్ల, ప్రయాణ తేదీలను మార్చడానికి అనుమతినిచ్చింది.
Russia: పాకిస్తాన్ తయారీ ఫైటర్ జెట్ JF-17 కోసం రష్యా ఇంజన్లు ఇస్తోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపించింది. అయితే, ఈ ఊహాగానాలను రష్యా ఖండించింది. నిజానికి, JF-17 యుద్ధ విమానం కోసం పాకిస్తాన్‌కు RD-93 ఇంజిన్లను సరఫరా చేయడం వల్ల వాస్తవానికి భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందని రష్యన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు.
Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్ […]