Elon Musk: “నా చిన్నతనంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండేది”.. మస్క్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే నెంబర్ వన్ 1 బిలియనీర్. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్, న్యూరాలింక్ ఇలా టెక్ మొగల్‌గా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే తన బాల్యం అనుకున్నంత సంతోషంగా ఏం లేదని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ ఏడాది మేలో ఒక ట్వీట్‌లో తన బాల్యంలో అనుభవించిన బాధల్ని పంచుకున్నారు. 1989కి ముందు తాను సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌లో నివసించేవాడినని వెల్లడించారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో మరోసారి తన గతం గురించిన అనుభవాలను పంచుకున్నారు. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న అనుభవాలను చెప్పారు.
తన ప్రారంభ సంవత్సరాల్లో ‘అస్తిత్వ సంక్షోభం’ చుట్టుముట్టడాన్ని వివరించారు. జీవితానికి అర్థం ఏమిటి..? అవన్నీ అర్థరహితం కాదా..? ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు..? ఎందుకు ఉన్నాను..? అని తరుచుగా తనను తాను ప్రశ్నించుకున్నానని వెల్లడించారు. ప్రపంచంలో ప్రముఖ బిలియనీర్, సక్సెస్ ఫుల్ టెక్ దిగ్గజంగా ఉన్న ఎలాన్ మస్క్ మరో కోణాన్ని వెల్లడించారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
Read Also: Snake Video: షూస్ వేసుకునే ముందు జాగ్రత్త.. ఎందుకు తెలుసా..! వీడియో చూడండి
మస్క్‌కి చెందిన ఆటోబయోగ్రఫీలో అతని చిన్ననాటి పోరాటాలను గురించి చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రను రాసిన అమెరికన్ జర్నలిస్ట్ వాల్టర్ ఐజాక్సన్, మస్క్ బయోగ్రఫీని రాశారు. దక్షిణాఫ్రికాలో మస్క్ ఎదుర్కొన్న సంఘర్షణను ఇందులో వెల్లడించారు. మస్క్ చిన్నప్పుడు పాఠశాలలో వేధింపులకు గురయ్యాడని, ఒక విద్యార్థి మస్క్ తలపై తన్నడంతో మెట్లపై నుంచి పడిపోవడాన్ని ఇందులో ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాలో పెరగడంతో మస్క్ నొప్పిని ఎలా ఎదుర్కోవాలనేది నేర్చుకున్నాడంటూ పేర్కొన్నాడు.
మస్క్ తండ్రి ఎర్రోల్, తల్లి మాయే వివాహం కూడా సంతోషంగా లేదని, తరుచూ పిల్లల ముందు గొడవ పడేవారని ఐజాక్సన్ పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసులో మస్క్ సర్వైవల్ క్యాంప్‌కి వచ్చాడనేది కూడా పుస్తకంలో వివరించారు. ఈ క్యాంపులో ఇతర పిల్లల కన్నా మస్క్ చిన్నవాడని, రెండుసార్లు మస్క్‌ని క్యాంపులో కొట్టారని పుస్తకంలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!