Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ.. తొలిసారి ఎమ్మెల్యేని వరించిన అత్యున్నత పదవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని బీజేపీ అనూహ్యంగా సీఎంగా ప్రకటించింది. ఈ రోజు జరిగిన శాసనసభపక్ష నేతని ఎన్నుకునే సమావేశంలో సీఎం అభ్యర్థిగా భజన్ లాల్ శర్మని ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో సంగనేర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ పేరును మాజీ సీఎం వసుంధర రాజే ప్రకటించారు. సంగనేర్ నుంచి ఈయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. బ్రహ్మన వర్గానికి చెందిన ఇతని వైపే బీజేపీ మొగ్గు చూపింది. ప్రస్తుతం బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా భజన్ లాల్ పనిచేస్తున్నారు. దియాకుమారి, ప్రేమ్ చంద్ భైర్వాలను డిఫ్యూటీ సీఎంలుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. భజన్ లాల్ శర్మ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేశారు. నాలుగు సార్లు రాజస్థాన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
Read Also: Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ.. తొలిసారి ఎమ్మెల్యేని వరించిన పదవి..
రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో పలువురు కేంద్రమంత్రులతో పాటు మాజీ సీఎం వసుంధర రాజే ఉన్నప్పటికీ.. అనూహ్యంగా భజన్ లాల్ శర్మని అత్యున్నత పదవి వరించింది. కేంద్రమంత్రులు అశ్విణి వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు మాజీ సీఎం వసుంధర రాజే, ఎంపీ బాలక్ నాథ్, దియా కుమారి పేర్లు వినిపించాయి. అయితే ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్‌లో అనూహ్యంగా ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించిన బీజేపీ, రాజస్థాన్‌లో కూడా కొత్త వ్యక్తిని సీఎంగా ప్రకటించి సంచలనం సృష్టించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!