Putin: అప్పుడే శాంతి నెలకొంటుంది.. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా రోజుల తర్వాత మీడియాలో, ప్రజలనుద్దేశించి గురువారం మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పుతిన్ 2030 వరకు అధ్యక్షుడిగా ఉండేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు. మార్చిలో జరగబోయే రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించింది. మన లక్ష్యాలు సాధించినప్పుడే శాంతి నెలకొంటుందని పుతిన్ స్పష్టం చేశారు. మన లక్ష్యాలు మారవమని, ఉక్రెయిన్ ప్రాంతాన్ని డీ-నాజిఫికేషన్, డీ-మిలిటరైజేషన్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందని పుతిన్ చెప్పారు. రష్యా జాతీయ టెలివిజన్‌లో నాలుగు గంటల పాటు పుతిన్ కనిపించారు. రెండేళ్లుగా కొనసాగుతున్న పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ ఒంటరితనం రష్యా ఆర్థిక వ్యవస్థను, నైతికతను దెబ్బతీయలేదని పుతిన్ అన్నారు. మనం ఆత్మవిశ్వాసాన్ని అనుభవించడమే కాదు, ముందుకు సాగడానికి సరిపోతుందని అన్నారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Read Also: VC.Sajjanar: బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. రేపటి నుంచి ఇవి తప్పని సరి..!
పుతిన్ కార్యక్రమం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. మరోవైపు రష్యా ప్రయోగించిన 42 డోన్లలో ఒకటి మినహా అన్నింటిని కూల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు పుతిన్ సమావేశానికి సమాంతరంగా బ్రస్సెల్స్ వేదికగా ఈయూ సమావేశం జరిగింది. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ సభ్యత్వానికి హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇతను పుతిన్ఋకి మిత్రుడిగా ఉన్నారు. ఉక్రెయిన్ కూటమిలో చేరుకునేందుకు మెరిట్ ఆధారిత ప్రమాణాలను అందుకోలేదని విక్టర్ చెప్పారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!