Parliament security breach: పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించి, దాడికి యత్నించిన కేసులో మాస్టర్ మైండ్‌గా చెప్పబడుతున్న లలిత్ ఝాకి ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు 7 ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ పోలీసులు పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజులకు పరిమితం చేసింది. ఈ దాడి ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న లలిత్ ఝా గురువారం పోలీసులకు లొంగిపోయాడు.
Read Also: Parliament Attack: పార్లమెంట్‌పై దాడికి ప్లాన్-బి కూడా ఉంది.. విచారణలో సంచలన విషయాలు..
ఈ కేసులో పార్లమెంట్ లోపల ఘటనకు పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్‌తో పాటు వెలుపల నీలందేశీ, అమోల్ షిండేను అరెస్ట్ చేశారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు నిందితులను గురువారం కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. వీరిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం USPA కింద అభియోగాలు నమోదు చేసింది. మరో నిందితుడు విశాల్ శర్మ అలియాస్ విక్కీని గురుగ్రామ్‌లోని అతని ఇంటిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: New Delhi : విమానాశ్రయంలో మే నుంచి అందుబాటులోకి సీటీఎక్స్ స్కానర్లు, క్యాబిన్ బ్యాగులు..
విప్లవ భావజాలం కలిగిన వీరంతా దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. దీంతో పాటు ఒకవేళ ప్లాన్-ఏ విఫలమైతే, ప్లాన్-బీకి పాల్పడేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. రైతులు నిరసన, మణిపూర్ అంశం, నిరుద్యోగం వంటి సమస్యలతో కలత చెందడంతో ఈ దాడికి పాల్పడినట్లు నిందితులు పేర్కొన్నారు.