Bharat NCAP: టాటా మోటార్స్ భారత్‌లో అత్యంత సేఫ్టి రేటింగ్స్ కలిగిన కార్లుగా ఉన్నాయి. టాటా నుంచి వస్తున్న టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు సేఫ్టీ రేటింగ్స్‌లో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. వినియోగదారుడి భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని కార్ల బిల్ట్ క్వాలిటీని స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ఇప్పటికే టాటాకి చెందిన నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు గ్లోబల్ NCAP రేటింగ్స్‌లో 5-స్టార్స్ సాధించాయి.
Read Also: Pakistan: పాక్‌లో నెలలో కేవలం 5000 కార్ల అమ్మకం.. ఇండియాలో అయితే 10 గంటల్లోనే అంతకన్నా ఎక్కువ..
ఇదిలా ఉంటే మొట్టమొదటి సారిగా భారత్ NCAP రేటింగ్స్‌లో 5 స్టార్ సేఫ్టీని రేటింగ్‌ని కలిగి ఉన్న కార్లుగా టాటా మోటార్స్‌కి చెందిన న్యూ సఫారీ, హారియర్ మోడళ్లు నిలిచాయి. భారత్-NCAPలో 5-స్టార్ రేటింగ్స్ సాధించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభినందించారు. ‘‘చారిత్రక విజయానికి టాటా మోటార్స్‌కి అభినందనలు. కొత్త సఫారీ, హారియర్‌లకు మొట్టమొదటి భారత్ – NCAP 5-స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్‌ను అందించడం వినియోగదారుల భద్రతను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు’’ అని గడ్కరీ అన్నారు.
BNCAP వాహన భద్రత కోసం భారత దేశ స్వతంత్ర న్యాయవాదిగా నిలుస్తుందని, ప్రపంచ ప్రమాణాలకు బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేస్తుందని నితిన్ గడ్కరీ కొనియాడారు. శ్రేష్టత, భారత వినియోగదారుల శ్రేయస్సు కోసం నిబద్ధతకు ఇది ముఖ్య అంశంగా నిలుస్తుందని అన్నారు.
Congratulations to @TataMotors for the historic achievement! 💐
Presenting the first-ever Bharat – NCAP 5-star rating 🌟🌟🌟🌟🌟certification to the new Safari and Harrier is a momentous stride in enhancing consumer safety. BNCAP stands as India's independent advocate for… pic.twitter.com/rhRUAhPhHV
— Nitin Gadkari (@nitin_gadkari) December 20, 2023