Netanyahu: రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధం ముగిసేందుకు మార్గం సుగమం అయింది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ కుదిరింది. గాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చారు. ఈ నేపథ్యంలో, గురువారం ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇఫ్తికార్ ఖాన్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఖాన్ గురించి నిర్దిష్ట సమాచారం తెలిసిన తర్వాత పోలీసులు తెల్లవారుజామున 5.30-6.00 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కాస్గంజ్ కు చెందిన ఇఫ్తికార్ ఖాన్ పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. ఇతడిపై రూ. లక్ష రివార్డు ఉంది. Read Also: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు.. […]
Gerogia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది. ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్‌లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది. ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు […]
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదరడంపై మోడీ, ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇది కులం పేరుతో మానవత్వాన్ని నలిపేస్తున్న ‘తీవ్రమవుతున్న సామాజిక విషానికి’ చిహ్నంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ వేదికగా వరస ట్వీట్లలో సంచలన ఆరోపణలు చేశారు.
Cough syrup: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు 21 మంది చిన్నారులను బలి తీసుకుంది. ఆరోగ్యాన్ని నయం చేయాల్సిన మందు, పిల్లల ప్రాణాలను తీసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలు ఈ మందును నిషేధించాయి.
Witchcraft: మూఢనమ్మకాలు ముగ్గురి ప్రాణాలను తీశాయి. జార్ఖండ్‌లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపారు. రాష్ట్రంలోని లోహార్డాగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెష్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేక్రాంగ్ బార్టోలి గ్రామంలో బుధవారం రాత్రి ఈ హత్యలు జరిగాయి. మృతులను లక్ష్మణ్ నగేసియా (47), అతని భార్య బిఫాని నగేసియా (45), వారి తొమ్మిదేళ్ల కుమారుడు రాంవిలాస్ నగేసియాగా గుర్తించారు.
PM Modi: యూకే ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోడీ, ఖలిస్తానీ తీవ్రవాదాన్ని యూకే ప్రధాని ముందు లేవనెత్తినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘రాడికలిజం, హింసాత్మక తీవ్రవాదానికి ప్రజాస్వామ్య సమాజాలలో స్థానం లేదని, సమాజాలు అందించిన స్వేచ్ఛలను ఉపయోగించడానికి లేదా దుర్వినియోగం చేయడానికి అనుమతించరాదని ప్రధాన మంత్రి మోదీ నొక్కి చెప్పారు. రెండు వైపులా అందుబాటులో ఉన్న చ
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్‌కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ […]
Mayawati: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి గురువారం ప్రశంసలు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), తన ప్రభుత్వ హమాంలో నిర్మించిన సంస్థలు, దళిత స్మారక చిహ్నాల నిర్వహణ విషయంలో అఖిలేష్ యాదవ్ రెండు ముఖాలతో వ్యహరించారని విమర్శించారు.