Taliban: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఐక్యరాజ్యసమితి అనుమతి పొందిన తర్వాత, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత పర్యటనకు వస్తున్నారు. ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకీకి, భారత పర్యటన కోసం యూఎన్ అనుమతి ఇచ్చింది. 2021లో ఆఫ్ఘాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, ఓ తాలిబాన్ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. భారత, తాలిబాన్ అధికారులు పలుమార్లు యూఏఈ వేదికగా చర్చించారు. ఆఫ్ఘాన్‌కు మానవతా సాయం కింద భారత్ […]
UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
IAF: భారతదేశం జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన వందలాది ఉగ్రవాదులు హతం అవ్వడంతో పాటు, భారత వైమానిక దాడిలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలు 10 వరకు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఓ రకంగా చెప్పాలంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తాము భారత్‌కు చెందిన 6 ఫైటర్ జెట్లను కూల్చామని పాకిస్తాన్ తన ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా ఈ వాదనల్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు.
Kanpur Blast: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మర్కజ్ మసీదు సమీపంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వివరాల ప్రకారం, మూల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరంలో పేలుళ్ల కారణంగా ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. పేలుళ్ల దాడికి ఇళ్లు, సమీపంలోని దుకాణాల గోడలు పగిలిపోయాయి. పార్క్ చేసి ఉన్న రెండు స్కూటర్లలో ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. Read […]
US-Pakistan: ఉగ్రవాద దేశానికి అమెరికా మద్దతు తెలుపుతోంది. యూఎస్ పాకిస్తాన్ సంబంధాలు నానాటికి బలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రయోజనాల కన్నా, సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పాకిస్తాన్‌తో జతకట్టి భారత వ్యతిరేక పనుల్ని చేస్తున్నాడు.
గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
AI Crime: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని మిస్ యూజ్ చేస్తే వచ్చే పరిణామాల గురించి నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా దీనికి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక ఐటీ విద్యార్థి ఏకంగా 30 మంది మహిళా విద్యార్థుల పోర్న్ చిత్రాలను, మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేయడానికి ఏఐని వాడాడు.
Bengaluru: బెంగళూర్‌లో ఓ విద్యార్థి ‘‘ఆజాద్ కాశ్మీర్’’ మ్యాప్, జెండా ఉన్న టీషర్టును ధరించడం చర్చకు దారి తీసింది. నగరంలోని అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నిందితుడిని కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఇనాయత్ అమీన్‌గా గుర్తించారు. వివాదాస్పద టీషర్టు ధరించిన అమీన్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. Read Also: Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి.. వీడియోలో కనిపిస్తున్న బైక్ […]
Pakistan: పాకిస్తాన్ చాలా డేంజరెస్ గేమ్ ఆడుతోంది. ఇస్లామిక్, అరబ్ దేశాల్లో ఉన్న భయాలను పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటోంది. ఇస్లామిక్ ప్రపంచంలో కేవలం పాక్ వద్ద మాత్రమే అణు బాంబు ఉంది. ఈ బలంతో తాము ఇతర ఇస్లామిక్ దేశాలను రక్షిస్తామనే భ్రమను కల్పిస్తోంది.
Wife and Husband: ఢిల్లీలో ఓ మహిళ, తన భర్తపై దారుణమైన దాడికి పాల్పడింది. దినేష్ అనే వ్యక్తి తన మదన్‌గీర్ ఇంట్లో నిద్రిస్తుండగా, అతడి భార్య మరిగే నూనె, కారం పొడితో దాడి చేసింది. అక్టోబర్ 3న ఈ దాడి జరిగింది. 28 ఏళ్ల దినేష్ తీవ్రంగా కాలిన గాయాలపాలైన తర్వాత, సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిపై స్థానిక అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ […]