Crime: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ అన్నయ్య రామ్ కుమార్ బిందాల్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. డాక్టర్ అయిన రామ్ కుమార్ తనకు చికిత్స చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు మహిళ ఆరోపించింది. అత్యాచార బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. చికిత్స చేసినప్పటికీ తనకు ఎటువంటి ఉపశమనం లభించలేదని ఆమె అన్నారు. […]
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో 2021లో అధికారం చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ముత్తాఖీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది.
Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే జనరిక్ ఔషధాలపై సుంకాలను మినహాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మందులపై పన్నులు విధించాలా? వద్దా? అనే దానిపై నెలల తరబడి చర్చ జరిగిన తర్వాత జనరిక్ ఔషధాలపై సుంకాలను విధించే ప్రణాళికల్ని విరమించుకన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్‌ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(పీకే)తో శుక్రవారం భేటీ అయ్యారు. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతిసింగ్ ఇటీవల తన భర్తపై ఆరోపణలు చేసింది. పవన్ సింగ్‌పై ఇటీవల జ్యోతిసింగ్ వివాహేతర సంబందాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పీకేను కలవడం ఆ రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
Pakistan: పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతున్నారు పాక్ తాలిబాన్లు. తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఖైబర్ జిల్లాలో జరిగింది. తిరా ప్రాంతంలోని హైదర్ కందావో సైనిక పోస్టుపై దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇత్తిహాదుల్ ముజాహిదీన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు దాడికి పాల్పడినట్లు ప్రకటించాయి.
Taliban minister: 2021లో ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. రెండు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించాయి.
Ayodhya Ram Temple: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి.
India-Afghanistan: భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్‌లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఇప్పుడు కీలకం.
Bengaluru: ‘‘అథితి దేవోభవ’’ అని చెబుతుంటారు పెద్దలు. కానీ కర్ణాటకలో మాత్రం కొందరు విపరీతమైన భాషా దురాభిమానంతో వ్యవహరిస్తున్నారు. కన్నడేతరుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి బెంగళూర్ లేదా ఇతర కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే వారిని బలవంతంగా ‘‘కన్నడ’’ మాట్లాడాలని వేధిస్తున్నారు. ఈ జాడ్యం ఇతర రాష్ట్రాల వారిపై దాడి చేసేదాకా వెళ్లింది. ఇక ఉబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులకు అర్థంకాని […]