Hit-And-Run Law: కేంద్రం తీసుకువచ్చిన కొత్త హిట్-అండ్-రన్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు. త్వరలో అమలు చేయబోతున్న క్రిమినల్ కోడ్‌కి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునివ్వడంతో ఇది మిగతా వాహనదారుల్లో భయాలను పెంచుతున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇలాగే నిరసనలు కొనసాగితే నిత్యావసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన ‘భారత న్యాయ సంహిత’లో హిట్- అండ్- రన్ నేరానికి గరిష్ట శిక్ష సిఫారసు చేసింది. కొత్త చట్టం ప్రకారం ఈ నేరంలో 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 7 లక్షల జరిమానా విధించనున్నారు. ట్రక్కర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర వాణిజ్య వాహనాలు నడుపుతున్న వారు ప్రమాదం జరిగితే ఇంత పెద్ద జరిమానా ఎలా విధిస్తున్నారని ప్రశ్నించారు. ట్రక్కర్ల సంఘం నేతలు దీనిని నల్లచట్టంగా అభివర్ణిస్తున్నారు.
Read Also: Kishan Reddy: జనసేనతో బీజేపీ దోస్త్ కటీఫ్..! కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే నిరసనలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ఈ ఆందోళనల వల్ల పెట్రోల్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో పలు నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ బంకులు మందు జనాలు క్యూ కడుతున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయింది. పాట్నా, పూణే, ఔరంగాబాద్, థానే వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. థానేలో థానేలో ఆందోళనకారులు ముంబై-అహ్మదాబాద్ హైవేను దిగ్బంధించి పోలీసులపై రాళ్లు రువ్వారు. భోపాల్, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కూడా నిరసనలు జరిగాయి.