Taiwan: చైనాకి గట్టి దెబ్బ.. తైవాన్ ఎన్నికల్లో లై చింగ్-తే విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taiwan: ప్రపంచ వ్యాప్తంగా తైవాన్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తిని పెంచాయి. చైనా, తైవాన్‌ని సొంతం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్న వేళ, చైనాకు ట్రబుల్ మేకర్‌గా పేరుపొందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) నేత లై చింగ్-తే విజయం సాధించారు. వరసగా మూడో సారి అక్కడి ప్రజలు ఈ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపుతో చైనాకు గట్టి దెబ్బతాకినట్లు అయింది. ఎన్నికల సమయంలో లై చింగ్‌ని చైనా ప్రమాదకరమైన వేర్పాటువాదిగా నిందించింది. అయినా కూడా తైవాన్ ఓటర్లు లై కే మొగ్గు చూపారు. తైవాన్, చైనాలో భాగమే అని డ్రాగన్ కంట్రీ చేస్తున్న వాదనను లై చింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Read Also: S Jaishankar: భారత్ లేకుండా ప్రపంచం ఏ సమస్యపై నిర్ణయం తీసుకోలేదు..
Also Read
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
గత ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న లై, ఇప్పుడు అధ్యక్షుడు కాబోతున్నారు. అధ్యక్ష పదవి కోసం డీపీపీ నుంచి లై చింగ్ పోటీ చేయగా.. చైనా అనుకూల పార్టీగా పేరున్న ప్రతిపక్ష కువోమింగ్‌తాంగ్ పార్టీ తరుపున హూ యు ఇన్, తైవాన్ పీపుల్స్ పార్టీ నుంచి కో వెన్ జి అధ్యక్ష బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తైవాన్‌కి కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు 113 చట్ట సభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షాలు తమ ఓటమిని అంగీకరించాయి.
ప్రతిపక్ష పార్టీ కువోమింగ్‌తాంగ్ పార్టీ, ఎన్నికల్లో గెలిపిస్తే లైచింగ్ తేని గెలిపిస్తే తైవాన్‌లో అశాంతికి దారి తీస్తుందని ప్రజల్ని హెచ్చరించింది. మరోవైపు లై చింగ్ తే మాట్లాడుతూ.. తైవాన్ జలసంధి అంతటా శాంతి, యథాతథ స్థితిని పరిరక్షించడానికి, ద్వీప భద్రతను పెంచడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని లై చింగ్ తే అక్కడి మీడియాతో అన్నారు. ఈ ఎన్నికల్లో చైనా జోక్యాన్ని ఖండించారు. మరోవైపు ప్రతిపక్ష కువోమింగ్‌తాంగ్ పార్టీ గెలిస్తే వారిని అడ్డుపెట్టుకుని తైవాన్‌ని కంట్రోల్ చేయవచ్చని అనుకున్న చైనా ఆశలు అడియాసలు అయ్యాయి.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..