Maldives Row: “మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదు”.. మాల్దీవ్స్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Row: భారత్-మాల్దీవుల వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఐదు రోజుల పర్యటన ముగించుకుని సొంతదేశానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదని, మమ్మల్ని వేధించే లైసెన్స్ మీకు ఇవ్వబడలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే మయిజ్జూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.. ‘‘మేము చిన్న వారమే కావచ్చు, కానీ అది మమ్మల్ని బెదిరించే లైసెన్సు మీకు ఇవ్వదు’’ అని పరోక్షంగా ఇండియాను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
Read Also: Bat Virus: గబ్బిలాల్లో డెడ్లీ వైరస్‌ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. కరోనా లాగే ప్రాణాంతకం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి, అక్కడి అందమైన బీచుల్ని ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఉద్దేశిస్తూ అక్కడి ముగ్గురు మంత్రులు విధూషకుడు, ఇజ్రాయిల్ కీలుబొమ్మ అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇది వివాదానికి ఆజ్యం పోసింది. భారతీయులు మాల్దీవుల్ని బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ‘‘బాయ్ కాట్ మాల్దీవ్స్’’ అంటూ ట్రెండ్ చేశారు. చాలా మంది భారతీయలు, మాల్దీవ్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అక్కడి హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ క్యాన్సల్ చేసుకున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పర్యాటక, హోటల్ రంగం భారత్‌కి క్షమాపణ చెప్పింది. అయితే మాల్దీవ్స్ ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రుల్ని సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పింది. ద్వీప దేశమైన మాల్దీవ్స్ ఎక్కువగా టూరిజంపై ఆధారపడి ఉంది. ఆ దేశానికి వెళ్లే ఎక్కువ మంది టూరిస్టుల్లో భారత్‌దే అగ్రస్థానం. ఇదిలా ఉంటే మాల్దీవ్స్ వివాదంతో లక్షద్వీప్ వెళ్లేందుకు టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..