Budget Halwa: “బడ్జెట్ హల్వా” కార్యక్రమంలో నిర్మాలా సీతారామన్.. అసలు ఈ హల్వా ప్రాముఖ్యత ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget Halwa: మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో సాంప్రదాయ ‘హల్వా వేడుక’ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నార్గ్ బ్లాక్‌లోని కేంద్రం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కేంద్రం ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ ఉన్నారు.
బడ్జెట్ ప్రక్రియ ముగింపు, ముద్రణకు ముందు ఇలా హల్వా వేడుకలను సాంప్రదాయకంగా నిర్వహిస్తారు. రాబోయే బడ్జెట్ గోప్యత పాటించేందుకు, పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు బడ్జెట్ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులంతా ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉండాలి.
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్‌లో బీజేపీకి పరీక్ష
Read Also: Saudi Arabia: తొలి “లిక్కర్ షాప్” ప్రారంభించనున్న సౌదీ అరేబియా.. కానీ, కండిషన్స్ అప్లై..
హల్వా వేడుక: దీని ప్రాముఖ్యత ఏంటి..?
ఈ ఆచారం దశాబ్ధాలుగా ఉంది. ముఖ్యంగా భారతీయలు ఏదైనా వేడుకకు ముందు ఇలా స్వీట్లు పంచుకోవడం అనేది సంప్రదాయంగా ఉంది. శుభవార్తలకు నోరు తీపి చేసుకోవాలని చెబుతుంటారు. బడ్జెట్ కూడా అలాంటి వేడుక వంటిదే అని చెప్పేందుకు ఇలా హల్వా వేడకల్ని నిర్వహిస్తారు. భారత్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆచరించే ఒక సంప్రదాయం. ఇది దేశ బడ్జెట్ చివరి దశను సూచిస్తుంది. కేంద్రం పార్లమెంట్‌కి బడ్జెట్ సమర్పించే కొన్ని రోజుల ముందు ఈ వేడుకలు జరుగుతాయి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు.
అధికారికంగా బడ్జెట్ ముద్రణ ప్రారంభమవుతుంది. ఇది బడ్జెట్ ‘లాక్-ఇన్’ దశను సూచిస్తుంది. బడ్జెట్ తయారీ ప్రక్రియతో సంబంధం ఉన్న వారంతా, బడ్జెట్ సమర్పించే వకు కుటుంబానికి, ఇతరులతో సంబంధం లేకుండా మంత్రిత్వ కార్యాలయ ఆవరణలోనే ఉంటారు. ఈ ప్రక్రియ ప్రారంభాన్ని హల్వా వేడుకలు సూచిస్తాయి.
#WATCH | Delhi | The Halwa ceremony, marking the final stage of the Budget preparation process for Interim Union Budget 2024, was held in North Block, today, in the presence of Union Finance & Corporate Affairs Minister Nirmala Sitharaman and Union Minister of State for Finance… pic.twitter.com/wjoyI5QqQ3
— ANI (@ANI) January 24, 2024
తాజావార్తలు
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!