Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె తకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 65 మంది యుద్ధ ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం కుప్పకూలింది. క్రాష్ తర్వాత విమానం మంటల్లో చిక్కుకుంది. రష్యాకు చెందిన IL-76, హెవీ లిఫ్ట్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ 65 మంది ఉక్రెయిన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్(POWs)తో ప్రయాణిస్తున్న సమయంలో రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయింది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఆశ్చర్యకరమైన ఘటన ఎదురైంది. కొత్తగా ప్రారంభమయైన మందిరంలోకి కోతి ప్రవేశించింది. గర్భగుడిలోని రామ్ లల్లా విగ్రహం వరకు వెళ్లింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది.
INDIA bloc: కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. అదికార బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దింపుతామంటున్న ఇండియా బ్లాక్లో లుకలుకలు కనిపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
Meat Consumption: మాంసాహారం, శాఖాహారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తేలని అంశం. అయితే కొన్ని సందర్భాల్లో శాఖాహార భోజనం బెటర్ అని చెబుతుంటారు. ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే మాంసం తినాలని సూచిస్తుంటారు. చాలా మంది నాన్ వెజ్ అంటేనే ఇష్టపడుతుంటారు.
Pakistan: పాకిస్తాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశం, అక్కడి చట్టాలు కూడా ఇస్లామిక్ చట్టాలక అనుగుణంగానే ఉంటాయి. మరోవైపు అక్కడ స్త్రీలకు, వారి హక్కులకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇక పెళ్లి తర్వాత స్త్రీని అనేది కేవలం ఒక సొత్తుగానే భావిస్తుంటారు. కొట్టినా, తిట్టినా, తమకు ఇష్టం లేకుండా సెక్స్ చేసినా కూడా పాక్ చట్టాల్లో శిక్షలు విధించే సెక్షన్లు చాలా తక్కువ.
Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేశారు. శతాబ్ధాల కల ఈ రోజు నెరవేరిందని రామ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలువురు వివిధ చర్యల ద్వారా రామ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒడిశాకు చెందిన చేనేత కుటుంబం ‘రామాయణ గాథ’తో చీరను తయారు చేశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటుంది.
Pakistan: పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. నిలువెల్లా భారత్ వ్యతిరేకతక ప్రదర్శించే ఆ దేశం రామ మందిర ప్రారంభోత్సవంపై అసూయ పడుతోంది. అయోధ్యలో రామ మందిర ఓపెనింగ్ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్(ట్విట్టర్)లో కీలక ప్రకటన చేసింది. ‘‘భారత్లోని అయోధ్య నగరంలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలో 'రామ మందిరం' నిర్మించడాన్ని పాకిస్తాన్ ఖండిస్తోందని’’ ట్వీట్ చేసింది.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ అస్సాంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వసర్మ, రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అస్సాంలోని పవిత్ర బటద్రవా ధామ్ వెళ్లాలని రాహుల్ గాంధీ భావించినప్పటికీ.. భద్రత కారణాల దృష్ట్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు అస్సాం సీఎం దేశంలోనే అవినీతి సీఎం అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.