Dentist: కేరళలో ఓ పెషేంట్‌కి బాగున్న దంతాలను పీకేశాడు ఓ డెంటిస్ట్. చికిత్స చేయించుకునే సమయంలో 5 దంతాలను దెబ్బతీసినందుకు రూ. 5 లక్షలు జరిమానాగా కట్టాలని దంత వైద్యుడిని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఆదేశించింది. డెంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షైనీ ఆంటోనీ రౌఫ్ వట్టుకులానికి చెందిన కే ఆర్ ఉషా కుమారికి పరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో కమీషన్ పేర్కొంది.
Read Also: PM Modi: యూఏఈ అధ్యక్షుడిపై ప్రధాని ప్రశంసలు.. నా “సోదరుడు” అంటూ..
ఫిర్యాదు ప్రకారం.. ఉషా కుమారి తన పంటి పైభాగంలో ఏదైనా ఫ్రాక్చర్ల లేదా గ్యాప్ ఉందా అని తెలుసుకోవడానికి కొంత కాలం క్రితం డాక్టర్ రౌఫ్‌ని సంప్రదించింది. అయితే, డాక్టర్ రోగి అనుమతి లేకుండా ఐదు దంతాలు పాడైపోయాని చెప్పి డెంటల్ ప్రొసీజర్ నిర్వహించాడు. దీని తర్వాత రోగి విపరీతమైన నొప్పి, మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు కొట్టాయం డెంటల్ కాలేజీలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. పంటి పైభాగంలో క్రౌన్ ఫిక్స్ చేయడానికి ఆస్పత్రికి మరో రూ. 57,600 చెల్లించాల్సి వచ్చింది. డెంటల్ సర్జరీలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఫిర్యాదుదారుడి దంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఆమె మానసిక క్షోభను, ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని కమీషన్ గుర్తించింది. అందువల్ల రోగికి రూ. 5 లక్షలు చెల్లించాలని డాక్టర్‌ని ఆదేశించింది.