Farmers Protest: తన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ, రైతులు ఢిల్లీ ముట్టడికి పిలపునిచ్చారు. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో పాటు రైతులకు, రైతు కూలీలకు ఫించన్లు, లఖీంపూర్ ఖేరీ బాధితులకు ఆర్థిక సాయం వంటి పలు రకాల డిమాండ్లతో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి బయలుదేరారు. ఇదిలా ఉంటే, వీరిని అడ్డుకునేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించాయి. నిన్నటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్‌లను పోలీసులు ప్రయోగించి వారిని అడ్డుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రైతుల ఆందోళనలో పాల్గొంటున్న పలువురు వ్యక్తులు ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తి ప్రధానిని హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ‘‘గతంలో పంజాబ్ వచ్చిన సమయంలో ప్రధాని మోడీ తప్పించుకున్నారని, ఈ సారి పంజాబ్ వస్తే అతడిని ఎవరూ రక్షించలేరు’’ అంటూ చేసి వ్యాఖ్యల వైరల్ అయ్యాయి. 2022, జనవరి నెలలో ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సమయంలో ఫిరోజ్‌పూర్ వద్ద భద్రత ఉల్లంఘన జరిగింది. ఓ ఫ్లై ఓవర్‌పై కొన్ని నిమిషాల వరకు ఆయన కాన్వాయ్ అక్కడి నిలిచిపోయింది. పంజాబ్ పోలీసులు సరైన భద్రత కల్పించలేకపోవడంతో నిరసనకారులు ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు పంజాబ్ పోలీసులను సస్పెండ్ చేశారు.
రైతులు మొత్తం 12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. రైతు సంఘం నాయకులు జగ్జీత్ సింగ్ దల్వాల్ మరియు సర్వన్ సింగ్ పంధేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా, పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపునిచ్చాయి. స్వామినాథన్ కమిషన్ నివేదికలో పేర్కొన్న విధంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్లు అందించే పథకాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలని రైతులు కోరారు మరియు 2013 భూసేకరణ చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద సంవత్సరానికి 200 రోజుల ఉపాధి మరియు రూ. 700 రోజువారీ వేతనం అందించాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కూడా రైతులు విజ్ఞప్తి చేశారు.
"मोदी पिछली बारतो पंजाब से बच कर चला गया था इस बार पंजाब आया तो बचेगा नहीं"
मिलिए आंदोलनकारी से और मुझे बताएं कि इसे किसान कहूं, अन्नदाता कहूं, या आतंकवादी कहूं ? pic.twitter.com/iOlARrlzqr— Ashok Shrivastav (@AshokShrivasta6) February 14, 2024