Deloitte Analysis: ఆటోమొబైల్ రంగంలోని ఇటీవల కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పెట్రోల్/డిజిల్ ఆధారిత ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ICE) సాంకేతిక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు(EV), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV) వరకు వాహన రంగం అభివృద్ధి చెందింది. డెలాయిట్ యొక్క ఇటీవలి గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ (GACS) ప్రకారం.. 50 శాతం మంది భారతీయ వినియోగదారులు పెట్రోల్/డిజిల్ ఇంజన్ల నుంచి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV)లకు ప్రాధన్యత ఇస్తున్నట్లుగా తేలింది. 2023 అక్టోబర్ 5 నుండి 12వ తేదీ వరకు నిర్వహించబడిన డెలాయిట్ అధ్యయనం 1,000 మంది భారతీయ వినియోగదారులను సర్వే చేసింది.
80 శాతం మంది రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రూ.10 లక్షలు- రూ. 25 లక్షల లోపు వాహనాల్లో 59 శాతం పెట్రోల్/డిజిల్ ఇంజన్ వాహనాలకు మొగ్గు చూపగా.. 58 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రూ. 10 లక్షలు అంతకంటే తక్కువ ధరల వాహనాల్లో 23 శాతం ICE వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. 22 శాతం మంది EVలను ఇష్టపడుతున్నారు.
Read Also: Chaari 111: ‘చారి 111’కి సీక్వెల్… రుద్రనేత్ర యూనివర్స్‌లోకి స్టార్ హీరోలు!
ఈ స్టడీలో పాల్గొన్న 68 శాతం మంది పర్యావరణాన్ని ప్రస్తావించారు. చార్జింగ్ మౌలిక సదుపాయల గురించి విషయాల్లో, 66 శాతం మంది డ్రైవర్లు తమ వాహనాలను ఇంటి వద్దే ఛార్జ్ చేస్తామని, 22 శాతం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్ చేస్తామని చెప్పారు. ఫాస్ట్ ఛార్జింగ్ అవసరమని, ఎక్కువ మంది కస్టమర్లు క్రెడిట్/డెబిట్ కార్డ్ చెల్లింపులకు ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
సర్వే ప్రకారం.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లభ్యత, బ్యాటరీ భద్రత మరియు ఛార్జింగ్ సమయాల్లో కొనసాగుతున్న సమస్యలు నేపథ్యంలో కొత్త కారు కొనేవారు హైబ్రిడ్ టెక్నాలజీని ఇష్టపడుతున్నారు. యాజ్డ్ కార్ల కన్నా కొత్త కారు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. కనెక్టెడ్ వెహికల్స్ విషయాని వస్తే భద్రతకు భారతీయులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 71 శాతం మంది కనెక్టెడ్ ఫీచర్ల కోసం ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. 88 శాతం మంది రోడ్ సేఫ్టీ, కొలిజన్ ప్రివెన్షన్ కోరుకోగా.. 88 శాతం మంది మెయింటనెన్స్ అప్డేట్స్, వెహికిల్స్ హెల్త్ అలర్ట్ కోరుతున్నారు.