Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని విమర్శించే వ్యక్తిగా, ప్రతిపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకున్న అలెక్సీ నవాల్నీ ఇటీవల జైలులో మరణించాడు. అతడిని పుతిన్ ప్రభుత్వం హత్య చేసినట్లు వెస్ట్రన్ దేశాలు విమర్శిస్తున్నాయి. 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న ఆయన అనూహ్యరీతిలో ఇటీవల మరణించారు. ఆర్కిటిక్ పీనల్ కాలనీలో వారం క్రితం హఠాత్తుగా మరణించారు. అయితే, ఇప్పటి వరకు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించలేదు.
ఇదిలా ఉంటే, అలెక్సీ నవాల్నిని చంపేందుకు సోవియట్ యూనియన్ గూఢచర్య సంస్థ కేజీబీ పాత టెక్నిక్‌ని ఉపయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక వ్యక్తి గుండెపై ఒక పంచ్ ఇవ్వడం ద్వారా నవాల్నీని చంపడానికి ఉపయోగించి ఉపయోగించినట్లు మానవహక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచ్కిన్ అన్నారు. కేజీబీ ఏజెంట్లకు ఒక వ్యక్తి గుండెపై గట్టిగా కొట్టడం ద్వారా చంపే ట్రైనింగ్ ఇచ్చేవారని చెప్పారు. KGB అంటే సోవియట్ కాలం నాటి అంతర్గత భద్రతా సేవ. ఇది అధికారికంగా డిసెంబర్ 3, 1991న రద్దు చేయబడింది. ఇది తరువాత రష్యాలో ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (SVR)గా, తరువాత ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)గా మారింది.
Read Also: Naa Inti Number 13: నాకు మగాళ్లంటే మహా కోపం.. కానీ అంటున్న పుష్ప సింగర్
47 ఏళ్ల నవాల్నీ శరీరాన్ని బలహీన పరిచేందుకు కఠినమైన శీతల ఉష్ణోగ్రతలో గంటల తరుపున నిలబడి ఉంచారని, దీని ద్వారా అతని రక్త ప్రసరణను కనిష్ట స్థాయికి తగ్గించి, మొదటగా శరీరాన్ని నాశనం చేశారని, ఆ తర్వాత గుండెపై ఒక పంచ్ ఇచ్చి చంపినట్లు ఒసెట్కిన్ అన్నారు. నవాల్నీ శరీరంపై గాయాలు ఉన్నాయని ఒక వైద్యుడు చెప్పినట్లు నివేదికలు వస్తున్నాయి. రష్యా అధికారులు మాత్రం నవాల్ని మరణం ‘‘సడన్ డెత్ సిండ్రోమ్’’ వల్ల జరిగిందని అతని తల్లికి చెప్పారు. ఇది ఆకస్మిక కార్డియార్ అరెస్ట్‌ని సూచిస్తుంది. అతడిని రక్షించేందుకు సీపీఆర్ వంటివి చేశామని అయినా ఫలితం రాలేదని, ఆ తర్వాత మరణించాడని అధికారులు తెలిపారు.