Carbide gun: దీపావళి రోజు ‘‘కార్బైడ్ గన్’’ విషాదం.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు..
- దీపావళి రోజు మధ్యప్రదేశ్‌లో విషాదాలు..
- కార్బైడ్ గన్ కారణంగా కంటి చూపు కోల్పోయిన చిన్నారు..
- నిషేధం ఉన్నా దొంగచాటున అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Carbide gun: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్‌లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్‌ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు.
Read Also: Chiranjeevi : చిరంజీవి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
వీటిపై మధ్యప్రదేశ్‌లో నిషేధం ఉన్నా కూడా, దీనిని ఉల్లంఘించి కొంత మంది విక్రయించారు. ముఖ్యంగా, విదిశ జిల్లాలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు రిపోర్ట్ అయ్యాయి. రూ. 150-200 మధ్య దొరికే ఈ కార్బైడ్ గన్ బాంబుల వలే పేలుతున్నాయి. విదిషలో ఈ గన్‌లను విక్రయించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్ ఇలా అన్ని నగరాల్లోని ఆస్పత్రుల్లోని ఐ వార్డులు నిండిపోయాయి. భోపాల్‌లోని హమీడియా ఆస్పత్రిలో 72 గంటల్లో 26 మంది పిల్లలు చేరారు.
వైద్యులు మాట్లాడుతూ.. ఈ పరికరం వల్ల కళ్లకు ప్రత్యక్ష నష్టం కలుగుతుందని చెప్పారు. దీని పేలుడు తీవ్రత కంటిలోని రెటీనాను కాల్చే లోహ శకలాలు, కార్బైడ్ ఆవిరిని విడుదల చేస్తాయని హెచ్చరించారు. పిల్లల కళ్లు పగిలిపోయి శాశ్వత అంధత్వానికి దారి తీసే అనేక కేసులు నమోదైనట్లు వారు చెబుతున్నారు. ప్లాస్టిక్ లేదా టిన్ పైపుల్ని ఉపయోగించి కార్బైడ్ గన్ తయారు చేసి, వాటిలో గన్ పౌడర్, అగ్గిపుల్లల పొడి, కాల్సియం కార్బైడ్ నింపి, వాటిని వెలిగిస్తారు. దీంతో ఒక్కసారిగా రసాయన చర్య జరిగిన పెద్ద శబ్ధంతో పేలుడు సంభవిస్తుంది.
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!