Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో ట్యూషన్ టీచర్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై నిందితుడి ఇంటి వెలుపల అత్యాచారానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు నిరసన తెలిపారు. ఆగ్రహించిన ప్రజలు ఆ ప్రాంతంలోని కార్లను, ఆటోలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ వైమానికి దాడి..
టీచర్ లేని సమయంలో అతని సోదరుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూ తన తల్లిదండ్రులకు చెప్పిందని పోలీసులు తెలిపారు. ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాుట చేశారు. పరిస్థితిని మరింత రెచ్చగొట్టేందుకు కొందరు వాట్సాప్‌లో రెచ్చగొట్టే సందేశాలు పంపుతున్నారని, శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలను కోరారు.